NTV Telugu Site icon

TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌ సేవలు..

Tgsrtc

Tgsrtc

TGSRTC: దూర ప్రాంత ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్‌ వ్యాన్‌ల సేవలు అమల్లోకి వచ్చాయని ప్రకటించింది. ఈ సేవలు శుక్రవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయని పేర్కొంంది. తొలి విడతలో ఈసీఐఎల్‌- ఎల్బీనగర్‌ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి ఈ పికప్‌ వ్యాన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. దూరప్రాంత ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఈ పికప్‌ వ్యాన్‌లను తీసుకొచ్చింది.

Read also: Ration Mafia : ఏపీలో రేషన్‌ మాఫియాకు చెక్‌ పెట్టేందుకు రంగంలోకి దిగిన సిట్‌

విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి,ఒంగోలు,నెల్లూరు, కందుకూరు వెళ్లేవారి కోసం ఈ పికప్‌ వ్యాన్‌లు ఏర్పాటు చేశారు.కాప్రా మున్సిపల్‌ కాంప్లెక్‌, మౌలాలీ హెచ్‌బీ కాలనీ,మల్లాపూర్‌,హెచ్‌ఎంటీ నగర్‌, నాచారం,హబ్సిగూడ, ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌, నాగోల్‌, సుప్రజ ఆస్పత్రి, ఎల్బీనగర్‌ ఎల్‌పీటీ మార్కెట్‌ నుంచి పికప్‌ వ్యాన్‌లు అందుబాటులో ఉంటాయి.మరిన్ని వివరాలకు 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ తెలిపింది.

Read also: Discount on SUV: ఈ SUVపై రూ. 4.75 లక్షల తగ్గింపు.. డిసెంబర్ 31 వరకే ఆఫర్!

మరోవైపు టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి శుభవార్త చెప్పింది. అన్ని ఏసీ బస్సు టికెట్లపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఏసీ స్లీపర్, ఏసీ సీటర్-స్లీపర్, రాజధాని బస్సుల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉందని వారు తెలిపారు. సులభతరమైన సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ ఆఫర్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్‌ను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని వారు సూచించారు.
Ration Mafia : ఏపీలో రేషన్‌ మాఫియాకు చెక్‌ పెట్టేందుకు రంగంలోకి దిగిన సిట్‌

Show comments