Site icon NTV Telugu

TET Hall Tickets: అభ్యర్థులకు అలర్ట్‌.. నేటి నుంచి టెట్ హాల్‌టికెట్‌

Tet

Tet

TET Hall Tickets: టీఎస్‌ టెట్‌ అభ్యర్థులు నేటి (బుధవారం) నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎస్సీఈఆర్టీ అధికారులు ఈ నెల 20 నుంచి జూన్‌ 2వరకు టెట్‌ నిర్వహించనున్నారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతి(సీబీటీ)లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈఏడాది టెట్‌ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 48,582 మంది సర్వీస్‌ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు. సీబీటీ విధానంలో మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 జిల్లాల్లో టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలంటే టెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

Read also: HD Revenna : జైలు నుంచి విడుదలైన రేవణ్ణ.. నేడు హోలెనర్సీపూర్‌ లో ర్యాలీ

టెట్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టిఆర్‌టి) పరీక్ష రాయడానికి అర్హులు. పేపర్ 1 పరీక్షకు డీఈడీ ఉత్తీర్ణతతోపాటు జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణత. జనరల్ అభ్యర్థులకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు, 2015కి ముందు డీఈడీ పూర్తి చేసిన ఇతరులకు 40 శాతం మార్కులు. పరీక్ష ఫీజు కింద ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున చెల్లించాలి. టెట్ ఫలితాలు జూన్ 12న విడుదల కానున్నాయి. టెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. ఆ తేదీల్లో పేపర్ 1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుంది. జనరల్ కేటగిరీ 90, బీసీ 75, ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు 60 మార్కులు అర్హులు. టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లో వచ్చే మార్కులకు 80 టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం..

Exit mobile version