TET Hall Tickets: అభ్యర్థులకు అలర్ట్.. నేటి నుంచి టెట్ హాల్‌టికెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TET Hall Tickets: టీఎస్ టెట్ అభ్యర్థులు నేటి (బుధవారం) నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎస్సీఈఆర్టీ అధికారులు ఈ నెల 20 నుంచి జూన్ 2వరకు టెట్ నిర్వహించనున్నారు. తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ పద్ధతి(సీబీటీ)లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఈఏడాది టెట్ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 48,582 మంది సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు. సీబీటీ విధానంలో మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 జిల్లాల్లో టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలంటే టెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
Read also: HD Revenna : జైలు నుంచి విడుదలైన రేవణ్ణ.. నేడు హోలెనర్సీపూర్ లో ర్యాలీ
Also Read
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
టెట్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టిఆర్‌టి) పరీక్ష రాయడానికి అర్హులు. పేపర్ 1 పరీక్షకు డీఈడీ ఉత్తీర్ణతతోపాటు జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణత. జనరల్ అభ్యర్థులకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు, 2015కి ముందు డీఈడీ పూర్తి చేసిన ఇతరులకు 40 శాతం మార్కులు. పరీక్ష ఫీజు కింద ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున చెల్లించాలి. టెట్ ఫలితాలు జూన్ 12న విడుదల కానున్నాయి. టెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. ఆ తేదీల్లో పేపర్ 1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుంది. జనరల్ కేటగిరీ 90, బీసీ 75, ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు 60 మార్కులు అర్హులు. టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లో వచ్చే మార్కులకు 80 టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..