Site icon NTV Telugu

TS SSC Hall Ticket 2025: టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్

Ssc

Ssc

TS SSC Hall Ticket 2025: తెలంగాణ రాష్ట్రంలోని టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. పదవ తరగతి పరీక్షలు రాస్తున్న వారు ఈరోజు (శుక్రవారం) నుంచి వెబ్‌ సైట్‌లో తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 21వ తేదీ నుంచి పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇవాళ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు పెట్టనున్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 10వ తరతగతి పరీక్షలు జరగనున్నాయి. అలాగే, పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ఈ https://bse.telangana.gov.in/ లింక్ పై క్లిక్ చేసి మీ హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Read Also: AP Assembly Sessions 2025: ఇవాళ శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ!

పదో తరగతి పరీక్షల షెడ్యూల్..

* మార్చి 21 – ఫస్ట్‌ లాంగ్వేజ్‌
* మార్చి 22 – సెకండ్‌ లాంగ్వేజ్‌
* మార్చి 24 – ఇంగ్లీష్‌
* మార్చి 26 – మ్యాథ్స్‌
* మార్చి 28 – ఫిజిక్స్‌
* మార్చి 29 – బయాలజీ
* ఏప్రిల్‌ 2 – సోషల్‌ స్టడీస్‌

Exit mobile version