Site icon NTV Telugu

Half day Schools: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎల్లుండి నుంచే ఒంటిపూట బడులు..

School

School

Half day Schools: తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు శుభ వార్త చెప్పింది. వేసవి కాలం నేపథ్యంలో ఈనెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒక్క పూట బడులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు స్కూల్స్ పని చేయనున్నాయి. ఇక, 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు క్లాసులు జరగనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Read Also: Crime: భార్యను చంపి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త..

అయితే, తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో.. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ ఒంటి పూట బడులు నిర్వహించడానికి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2025 మార్చి 15వ తేదీ నుంచి ఈ ఒక్క పూట బడులు కొనసాగనున్నట్లు తెలిపారు. ఇక, లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23వ తేదీ వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి.

Exit mobile version