Site icon NTV Telugu

Telanga Police: బీ కేర్‌ ఫుల్‌.. టెలిగ్రామ్‌లో వచ్చే లింక్స్‌ ఎట్టిపిస్థితుల్లో క్లిక్‌ చేయొద్దు..

Telangana Police

Telangana Police

Telanga Police: గత కొన్ని నెలలుగా సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. నేరగాళ్లు రకరకాల పద్ధతులను అనుసరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. నిరక్షరాస్యులు మాత్రమే కాదు, విద్యావంతులు, వ్యాపారులు, సంపన్నులు కూడా వీరి వలలో పడి నష్టపోతున్నారు. మోసాలకు పాల్పడేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు నిత్యం కొత్త అవతారం ఎత్తుతూ అమాయక ప్రజల నుంచి డబ్బులు దోచేస్తున్నారు.

Read also: CM Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్​ రెడ్డి.. మూడు రోజుల పాటు మకాం అక్కడే..

డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఇటీవల పలువురిని మోసం చేసి డబ్బులు దండుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా పైరసీ సినిమాలు, అశ్లీల వీడియోలు చూసేందుకు కొందరు టెలిగ్రామ్‌లోని వివిధ గ్రూపుల్లో చేరుతున్నారు. సైబర్ నేరగాళ్లు దీన్ని అవకాశంగా తీసుకుని గ్రూప్‌లలో నకిలీ వెబ్ లింక్‌లను షేర్ చేస్తూ మన ఫోన్‌లలోని డేటాను దొంగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

Read also: Maoists: చింతూరు ఏజెన్సీలో మావోల దుశ్చర్య.. కారును దగ్ధం చేసిన మావోయిస్టులు!

టెలిగ్రామ్‌లో తెలియని నంబర్‌లు/గ్రూప్‌ల నుండి వచ్చే లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్త సినిమాలు, వీడియోల పేరుతో లింక్ లు షేర్ అవుతున్నాయని, ఈ లింక్స్ పై క్లిక్ చేస్తే మీ పర్సనల్ డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు. ఇలా వేలాది మెసేజ్ లకు స్పందిస్తే ఆధార్ , పాన్ వివరాలు సేకరించి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన పోలీసులు. ఈ మేరకు తెలంగాణ పోలీసు ఎక్స్ లో వీడియో కూడా పోస్ట్ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.

Read also: NBK 109 : ‘డాకు మహారాజ్’ ఫస్ట్ లిరికల్ సాంగ్.. ఫ్యాన్స్ కు పూనకాలే.!

ఇలా చేస్తే మీరు సేఫ్..

*. లోన్ యాప్‌లకు దూరంగా ఉండండి.
*. Googleలో కస్టమర్ కేర్ నంబర్‌ల కోసం అస్సలు వెతకవద్దు.
*. కస్టమర్ కేర్ నంబర్‌లను సంబంధిత కంపెనీల అధికారిక వెబ్‌సైట్ల నుండి మాత్రమే పొందాలి.
*. ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా తెలియని నంబర్‌ల నుండి వచ్చే వీడియో కాల్‌లకు స్పందించవద్దు.
*. లాటరీ ఆఫర్లు అంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దు.
*. ధృవీకరించని యాప్‌లు, వెబ్‌సైట్‌లు అందించే ప్రకటనలను నమ్మవద్దు. వారు చేసే మోసపూరిత ఆఫర్లకు ప్రతిస్పందించి మోసపోకండి.
Tragedy: విషాదం.. పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు గల్లంతు

Exit mobile version