NTV Telugu Site icon

Group1 Prelims Results: గ్రూప్‌ -1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల ..

Group1 Prelims Results

Group1 Prelims Results

Group1 Prelims Results: తెలంగాణ గ్రూప్-1 పరీక్ష విద్యార్థులకు హెచ్చరిక. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ కీతో పాటు ఫలితాలను టీజీపీఎస్సీ ఆదివారం ప్రకటించింది. ప్రిలిమినరీ కీపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన కమిషన్ తుది కీని విడుదల చేసింది. అనంతరం ఫలితాలను వెల్లడించారు. అయితే.. పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/లో ఫలితాలను చూసుకోవచ్చని కమిషన్ అధికారులు తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరగనున్నాయి. కాగా..రాష్ట్రంలోని 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాల్లో 4.03 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. జూన్ 13న ప్రాథమిక కీని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Read also: Kalki2898AD Records: సౌత్ ఇండియా హీరోలలో ‘ఒకే ఒక్కడు’ ప్రభాస్!

కాగా, గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిని ఎంచుకోవాలని నిరుద్యోగులు గత కొంత కాలంగా ఉద్యమం చేస్తున్నారు. ఇదే డిమాండ్ తో ఈ నెల 5న కూడా టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే 1:50 నిష్పత్తి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా తమ అభ్యర్థనను నిర్లక్ష్యం చేస్తోందని అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఇదే జరిగితే ఉద్యమాలు ఉధృతం చేయడం తప్ప మరో మార్గం లేదన్న అభిప్రాయానికి నిరుద్యోగులు వచ్చినట్లు తెలుస్తోంది. 1:100 నిష్పత్తి అమలు చేస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవని ప్రజాప్రతినిధులు ఉద్ఘాటిస్తున్నారు.

Read also: Ration Cards: రాష్ట్ర ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ ..రేషన్ కార్డులో సవరణలపై గ్రీన్ సిగ్నల్..

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 1:50 నిష్పత్తి అమలు కోసం తీసుకొచ్చిన జీవో 29ని సవరించాలని గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జియో వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అందరికీ న్యాయం జరిగేలా గతంలో మాదిరిగానే జీవో 55ని అమలు చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 2లో 2 వేలు, గ్రూప్ 3లో మూడు వేల పోస్టులను పెంచుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
Heavy Rains : హిమాచల్ నుంచి అస్సాం వరకు వరద బీభత్సం.. యూపీలో 13 మంది మృతి

Show comments