Ponnam Prabhakar: తెలంగాణ ప్రభుత్వం విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సచివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈనెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కూడా ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తారని తెలిపారు. దీంతో ప్రభుత్వం తరపున ఆహ్వాన పత్రిక అందించేందుకు ఇప్పటికే కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వారి సిబ్బందికి సమాచారం ఇచ్చామని మంత్రి పొన్నం అన్నారు.
Read also: Hyundai Cars Price: హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్.. ఈనెల 31 వరకే అవకాశం!
వాళ్ళు సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం ఇవ్వడం జరుగుతుందని పొన్నం తెలిపారు. వారు ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం తరుపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కాగా, సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటును బీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చోటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన మార్పులపై బీఆర్‌ఎస్ కూడా భగ్గుమంటోంది.
IND vs AUS: ‘ఆరే’సిన స్టార్క్.. 180కి భారత్ ఆలౌట్! టాప్ స్కోరర్ మనోడే