Site icon NTV Telugu

Telangana Govt: గద్దర్ ఫౌండేష‌న్‌కు రూ.3 కోట్లు మంజూరు..

Tg

Tg

Telangana Govt: ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆలోచ‌న‌లు, ఆయ‌న ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ్లేందుకు గానూ గద్దర్ ఫౌండేష‌న్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఫౌండేష‌న్‌కు అవ‌స‌ర‌మైన నిధులు కేటాయిస్తామ‌ని గ‌తంలో జ‌రిగిన గద్దర్ జ‌యంతి వేడుక‌ల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేర‌కు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక రంగంపై త‌నదైన ముద్ర వేసిన గద్దర్ సేవ‌ల‌కు గుర్తింపుగా ఆయ‌న జ‌యంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతుంది.

Read Also: Iran-Israel War: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. తాజా దాడుల్లో 78 మంది మృతి

అయితే, ముందు గద్దర్ జ‌యంతి వేడుక‌ల కార్యక్రమాల నిర్వహాణలోనూ గద్దర్ ఫౌండేష‌న్‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తూ మ‌రో ఉత్తర్వును కాంగ్రెస్ సర్కార్ జారీ చేసింది. మరోవైపు, గద్దర్ పేరుతో సినీ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ హైటెక్స్ వేదికగా జరిగే వేడుకల్లో విజేతలకు అవార్డులను అందించి సత్కరించనున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే, ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మితో పాటు పలువురు పాల్గొననున్నారు.

Exit mobile version