TG DSC Exams 2024: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. రోజు రెండు సెషన్ లలో డీఎస్సీ నిర్వహించనున్నారు అధికారులు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 29న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. సుమారు 2 లక్షల 79 వేల 957 మంది అభ్యర్థులు పరీక్షలకి దరఖాస్తు చేసుకున్నారు. ఒకవైపు పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తుంటే… రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది.
Read also: Bhatti Vikramarka: నాలుగు నెలలు మాత్రమే.. నైనీ బొగ్గు ఉత్పత్తి పై భట్టి విక్రమార్క వ్యాఖ్యలు..
ఇప్పటికే హాల్ టిక్కెట్లు జారీ కాగా.. తొలిసారి ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మెదక్‌లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 జూలైలో తొలి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఏడేళ్ల తర్వాత ఇది రెండో రిక్రూట్‌మెంట్ పరీక్ష. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరగనున్నాయి. డీఎస్సీ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలో ఈసారి ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ప్రతి జిల్లా అభ్యర్థులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షకు ముందు ఇలా..
* ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి.
* అభ్యర్థులు మునుపటి రోజు ప్రిపరేషన్ కంటే ఎక్కువగా పరీక్షకు హాజరు కావడానికి అవసరమైన వస్తువులను సిద్ధం చేసుకోవాలి.
* అభ్యర్థులు ముందురోజు రాత్రి బాగా నిద్రపోవాలి.
* పరీక్ష రోజున, నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోండి.
* కేటాయించిన స్థలం, కంప్యూటర్ పనితీరును పరిశీలించి కూర్చున్న తర్వాత ఇచ్చిన సూచనల మేరకు ఆన్‌లైన్ పరీక్ష రాయాలి.
* తెలిసిన సమాధానాలను గుర్తించిన తర్వాత, మిగిలిన ప్రశ్నలకు సమాధానాలను ఎలిమినేషన్ పద్ధతి ద్వారా అంచనా వేయాలి.
* టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ, డీఎస్సీ పరీక్షను 80 మార్కులకు నిర్వహిస్తారు.
* ప్రతి ప్రశ్నకు అరమార్క్ చొప్పున 160 ప్రశ్నలు ఉంటాయి.
DSE Hall Ticket: డీఎస్సీ హాల్‌టికెట్‌లో అబ్బాయికి బదులు అమ్మాయి ఫొటో.. అప్లై ఎలా చేశారో..!