Site icon NTV Telugu

Rythu Runa Mafi: రెండో విడత రైతు రుణమాఫీ.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

Rythu Runa Mafi

Rythu Runa Mafi

Rythu Runa Mafi: ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగణంలో లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. రెండో దశలో దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు. మొదటి విడత ఈ నెల 19న ప్రారంభమైంది. తొలి విడతలో దాదాపు 10.83 లక్షల కుటుంబాలకు చెందిన పదకొండున్నర లక్షల ఖాతాల్లో రూ.6 వేల కోట్లు జమయ్యాయి. ఆధార్ నంబర్, ఇతర వివరాలు సరిగా లేకపోవడంతో దాదాపు 17 వేల మందికి రుణమాఫీ సొమ్ము అందలేదు. మూడో విడతలో ఆగస్టు 15 నాటికి ఒకటిన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రుణమాఫీని మూడు విడతల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే..

Read also: CM Revanth Reddy: లక్షల మంది రైతుల ఇండ్లలో సంతోషం.. ఇది మా ప్రభుత్వ చరిత్ర..

మూడు విడతల్లో రూ.31 వేల కోట్ల మాఫీ: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల లోపు పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సమావేశంలో తెలిపారు. ఆగస్టులోపు రుణమాఫీ చేస్తామన్న సవాల్ ను హరీశ్ రావు స్వీకరించి మాఫీ చేస్తున్నామన్నారు. తొలి విడతలో రూ.6,093 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. రెండో విడతలో రూ.లక్ష వరకు రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. లక్షన్నర మాఫీ చేస్తామన్నారు. మూడో విడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, మూడు విడతల్లో రూ.31 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కాగా.. పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే రుణమాఫీ సొమ్మును దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు పన్నాగం పన్నుతున్నారు. దీంతో రైతులు తమ ఫోన్లకు వచ్చే మెసేజ్‌లపై క్లిక్ చేయవద్దని సైబర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే మీ రైతు రుణమాఫీ సొమ్ము దోచుకునే అవకాశం ఉందని, అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వవద్దని హెచ్చరించారు.
Nirmal Crime: రన్నింగ్‌ బస్సులో మహిళపై అత్యాచారం.. నోట్లో గుడ్డలు కుక్కి..!

Exit mobile version