CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు జైపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీకి సీఎం రేవంత్ పయనం కానున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సమావేశం కానున్నారు. తన ఏడాది పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై కాంగ్రెస్ హైకమాండ్ కు సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.
Read also: Israel-Lebanon: దళాల ఉపసంహరణపై పర్యవేక్షణకు రంగంలోకి దిగిన యూఎస్
కాగా.. బుధవారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో సీఎంకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్, సీఎల్పీ నేత తికారం జల్లి, ఎమ్మెల్యే అమిత్ చరణ్ ఘన స్వాగతం పలికారు. పెళ్లి వేడుకల అనంతరం రేవంత్ గురువారం అక్కడి నుంచి ఢిల్లీ చేరుకోనున్నారు. ప్రగతి నివేదన సభలో భాగంగా హామీల అమలుతో పాటు రైతు రుణమాఫీ, చిన్నకారు రైతులకు బోనస్ తదితర పథకాల అమలు, కుల గణన తదితర అంశాలను హైకమాండ్ కు వివరించనున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై కూడా హైకమాండ్ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Read also: Sai Pallavi: ఇకపై ఊరుకునేది లేదు.. లీగల్ యాక్షన్ తీసుకుంటా: సాయిపల్లవి
మరోవైపు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టితో పాటు ఆయా కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించనున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కేంద్ర అధికారులతో చర్చిస్తానని చెబుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశ నిర్మాణం త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి కేటాయించిన కోటా నిధులను మంజూరు చేయాలని కోరనున్నట్లు సమాచారం.
Fake Love: ప్రేమ కోసం మతం మార్చుకున్న యువతి.. సహజీవనం చేసి డబ్బుతో పరారైన యువకుడు..