Assembly Budget Session 2024: నేడు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో 2024-25 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ను ఆమోదించేందుకు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్ సమావేశం కానుంది. ఇక మరోవైపు మూడో రోజు శాసనసభ సమావేశాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నేతగా దాదాపు ఏడు నెలల తర్వాత తొలిసారిగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఆశక్తికరంగా మారింది. అసలు అధికార పార్టీని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారనే చర్చ ప్రస్తుతం సాగుతోంది. బడ్జెట్ సమావేశాల రోజు కేసీఆర్ హాజరు కానున్నడంతో మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారో, మైక్ ఇస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మీకోసం లైవ్ లింక్.. మీకోసం
తెలంగాణ బడ్జెట్ సమావేశం అనంతరం సభను స్పీకర్ శనివారానికి వాయిదావేశారు.
గత దశాబ్దకాలంగా అపరిష్కృతంగా ఉన్న కంటోన్మెంట్ లోని రోడ్ల విస్తరణకు మరియు ఎలివేటడ్ కారిడార్ల నిర్మాణానికి మా ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి రక్షణ శాఖ వారితో సంప్రదించి దానికి కావలసిన భూమి బదిలీకి వారి ఆమోదాన్ని కూడా పొందడం జరిగింది. నిజంగా ఇది హైదరాబాద్ మరియు రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త. రోడ్లు మరియు భవనాల శాఖకి ఈ బడ్జెట్ లో 5,790 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
ఆధునిక ప్రపంచంలో రహదారులే ఆర్థిక వృద్ధికి జీవ నాడులు. అందుకే తెలంగాణలో సమగ్ద రహదారుల పాలసీ తయారు చేస్తున్నాం. దీనిలో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి తారు రోడ్డు వేయడం, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండు లేన్ల రహదారుల నిర్మాణం, జిల్లా కేంద్రం నుంచి రాజధానిని అనుసంధానించేలా హైవేల నిర్మాణం చేయడం ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం.
దీనివల్ల నిందితులకు త్వరితగతిన శిక్షలు పడి, మాదక ద్రవ్య సంబందిత కార్యకలాపాలకు పాల్పడే వారికి జంకు కలుగుతుంది. తెలంగాణలోని విద్యార్థుల తల్లిదండ్రులకు, తమ పిల్లలు డ్రగ్స్ నుండి దూరంగా, సురక్షితంగా ఉన్నారనే భరోసా కల్పించడమే మా ప్రభుత్వ ధ్యేయం. మా ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా చేస్తామని వాగ్దానం చేస్తుంది. హోం శాఖకి ఈ బడ్జెట్ లో 9,564 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
విద్యాసంస్థలలో మాదకద్రవ్యాల కట్టడికి Anti Drug Committees ఏర్పాటు చేసి.. 4,137 విద్యార్థులను Anti Drug Soldiers గా నియమించాము. మాదకద్రవ్యాల వల్ల జరిగే హాని పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సినీరంగ ప్రముఖుల సహకారం తీసుకుంటున్నాం. మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం.
తెలంగాణా మాదకద్రవ్య నిరోధక సంస్థను బలోపేతం చేసి, ఆ బ్యూరో కు తగిన సౌకర్యాలు కల్పించాం. ఇటీవలే ఈ బ్యూరో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠా కార్యక్రమాల గుట్టును రట్టు చేసింది. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని విద్యాసంస్థలను స్థానిక పోలీసులు పరిశీలించేటట్లు, మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్ధులకు అవగాహన కల్పించేటట్లు కార్యచరణ చేపట్టాం.
మాదక ద్రవ్యాల వినియోగం చాలా ప్రమాదకరం. యువత దీని బారిన పడ్డప్పుడు దేశ భవిష్యత్తే ప్రశ్నార్ధకం అవుతుంది. మా ప్రభుత్వం ఈ సమస్యను గ్రహించి అధికారంలోనికి వచ్చినప్పటినుంచి మాదక ద్రవ్యాల నియంత్రణకు ఒక జీరో టాలరెన్స్ పద్ధతిని అనుసరిస్తుంది. మాదక ద్రవ్యాల రవాణా, పంపిణీ, వినియోగాలపై ఉక్కు పాదం మోపి రాష్ట్ర ప్రజలను, అందులోనూ ముఖ్యంగా విద్యార్ధులను, ఈ మహమ్మారి బారి నుండి కాపాడడానికి వివిధ చర్యలను మా ప్రభుత్వం తీసుకుంది. మాదకద్రవ్యాల రవాణ మరియు వినియోగం చేస్తూ పట్టుబడిన వారు ఎంతటి గొప్పవారైనా, పలుకుబడి ఉన్నవారైనా ఉపేక్షించ వద్దని అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం.
నేరాలను చేదించేందుకు, ఆధునిక నేర పరిశోధనలో పోలీసులకు శిక్షణ ఇస్తున్నాము. సైబర్ క్రైమ్ ఫిర్యాదులను నమోదు చేయడానికి ఇంతకు ముందు ప్రజలకు కేవలం నాలుగు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో మాత్రమే సదుపాయం ఉండేది. కానీ మా ప్రభుత్వం ఈ ఫిర్యాదులను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో నమోదు చేసుకునేలా అవకాశం కల్పించాము. ఆన్ లైన్ లో సైబర్ క్రైమ్ పిర్యాదులు నమోదు చేసుకోవడానికి వెబ్ సైట్, టోల్ ఫ్రీ నెంబర్ కి విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాం..
శాంతి భద్రతల పరిరక్షణ ప్రజల ప్రశాంతతకు మరియు రాష్ట్రాభివృద్ధికి అత్యవసరమైన అంశం. అభద్రతా వాతావరణంలో పెట్టుబడి పెట్టడానికి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపించవు. టెక్నాలజీ అభివృద్ధితో నేరప్రవృత్తి పలు రూపులు దాల్చుతోంది. సాధారణ నేరాలు అరకట్టడంతో పాటు వైట్ కాలర్ క్రైమ్స్, సైబర్ నేరాలు అరికట్టడం పోలీసు వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. నేరస్తులను దీటుగా ఎదుర్కొని, నేర నివారణకు పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు సైబర్ సెక్యూరిటీ విభాగానికి అవసరమైన వాహనాలను ఇప్పటికే ప్రభుత్వం అందజేసింది.
పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ప్రాజెక్టు అయ్యే మొత్తం ఖర్చు 2,324 కోట్ల రూపాయలు. దీనిలో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం 307.95 కోట్ల రూపాయలు. మిగిలిన మొత్తాన్ని టాటా సంస్థలవారు వారి CSR కార్యక్రమ నిధుల నుంచి సమకూరుస్తారు. ఈ బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకి 300 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. విద్యరంగానికి ఈ బడ్జెట్ లో 21, 292 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ ఐటిఐలలో ఆధునిక, సాంకేతిక పరికరాలు సమకూర్చబడతాయి. వాటిపై శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిపుణులను టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేశాము. ఈ నైపుణ్య కేంద్రాలు మన విద్యార్ధులకి, ఉద్యోగార్ధులకి ఎంతో ఉపయోగంగా ఉంటాయి. వీటిలో శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పనలో కూడా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సహకరిస్తుంది. ఈ ప్రాజెక్టును మల్లేపల్లి ఐ.టి.ఐ నుండి సీఎం జూన్ నెలలో ప్రారంభించారు.
నాణ్యమైన విద్య మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద మధ్యతరగతి విద్యార్థులకి అందుతుంది. గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని కాలరాసింది. వాటికి చాలా కాలం పూర్తికాలపు వైస్ చాన్సలర్ నియమించకుండా ఇంచార్జిల నియామకంతో కాలం గడిపింది. దీనివల్ల విశ్వవిద్యాలయాల పాలన మరియు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైనది. దీనివల్ల పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా పెరుగుతుంది.
నాణ్యమైన విద్య అత్యుత్తమ భవిష్యత్తుకి పునాది. సత్యం. రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత పరిష్టపరిచి బలోపేతం చేసి దిశగా మా ప్రభుత్వం పాఠశాలలు మరియు కళాశాలలో విద్యా ప్రమాణాలను పెంచి వాటికి కావలసిన వసతులు కూడా. సమకూరుస్తాం. మొదటి అడుగుగా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్ణయించి, 11,062 పోస్టులతో ఒక మెగా డిఎస్సి (DSC) ఇప్పటికే నోటిఫై చేశాం. దానికి సంబంధించిన పరీక్షలు జులై 18, 2024 నాడు ప్రారంభమై ఇంకా జరుగుతున్నాయి.
రాష్ట్రంలో ఇప్పటికి ఉన్న భారీ, మధ్యతరహా మరియు చిన్న ప్రాజెక్టుల నిర్వహణ కూడా గత పదేళ్లలో జరగకపోవడం వల్ల ఆ ప్రాజెక్టుల సామర్ధ్యానికి అనుగుణంగా ప్రజలకు మేలు జరుగలేదు. అవి అలాగే వదిలేస్తే మన జాతీయ సంపదగా భావించే ప్రాజెక్టులు నిరుపయోగం అవుతాయి. అందుకే మా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ మరియు మరమ్మత్తులను తగిన సమయంలో చేపట్టడానికి నిశ్చయించాము.
గత ప్రభుత్వం చివరి దశ నిర్మాణలలో ఉన్న చాలా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించింది. దీనివల్ల, ఎంతో ప్రజాదనం ఖర్చు అయ్యి కూడా ప్రజా అవసరాలను తీర్చడానికి ఇవి వినియోగంలోకి రాలేదు. మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులను మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టులను ఈ ఆర్ధిక సంవత్సరంలో, మరియు 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను గుర్తించి తగిన చర్యలు సూచించేందుకు విచారణ కమిటీని నియమించాము. ఈ న్యాయ విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికి ఖర్చుపెట్టిన వేల కోట్ల ప్రజా ధనం వృదా అవ్వకుండా ప్రాజెక్టును కాపాడడానికి National Dam Safety Authority వారి సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం.
గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, డిజైన్లలో లోపాలు, నాణ్యతా రహితంగా చేసిన నిర్మాణాలు ఆ ప్రాజెక్టు భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసాయి. ఈ ప్రాజెక్టు గురించి చేసిన ఆర్భాట ప్రచారంతో రైతులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, కొద్దికాలంలోనే ఈ ప్రాజెక్టు యొక్క డొల్లతనం. బయటపడి రాష్ట్రం అంతా దిగ్భ్ర్భాంతికి గురయ్యింది.
ఒకప్పుడు తెలంగాణకు గర్వకారణంగా ఉన్న నిజాం షుగర్స్ లిమిటెడ్ పలు రకాల ఒడిదొడుకుల కారణంగా మూత పడింది. దీనిని ఇప్పటివరకు ఎవరు పట్టుంచుకోలేదు. దానిని పునరుద్దరించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. కానీ, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేమిచ్చిన మాట ప్రకారం నిజాం షుగర్స్ లిమిటెడ్ పునరుద్ధరణకు జనవరి, 2024 లో ఒక కమిటీని నియమిందాము. త్వరలోనే తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం అయిన నిజాం షుగర్స్ లిమిటెడ్ ను తిరిగి ప్రారంభిస్తాం.
ఈ ధ్యేయంతో తెలంగాణా ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే హైదరాబాద్ లో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో "తెలంగాణా నైపుణ్యాల విశ్వవిద్యాలయాన్ని" (Skills University of Telangana), నిర్ణయిచింది. ఈ విశ్వవిద్యాలయంలో, 17 వివిధ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పే సర్టిఫికెట్, డిప్లమో, డిగ్రీ కోర్సులు ప్రారంభమౌతాయి. నేరుగా పరిశ్రమలతో అనుసంధానింపబడి, అధ్యయన - ఆచరణల మధ్య అంతరం లేని విధంగా, ఉద్యోగార్జన ఏకైక లక్షణంగా ఈ కోర్సుల బోధనాంశాలకు రూపకల్పన చేసాము.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించే అగ్రగామి గమ్యస్థానంగా తెలంగాణాను తీర్చిదిద్ది. స్థానికంగాను, విశ్వవ్యాప్తంగాను, సులభంగా ఉద్యోగాలు పొందడానికి కావలసిన ప్రపంచ స్థాయి నైపుణ్యాలను తెలంగాణా యువకుల్లో పెంపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
మానవులకు, జంతువులకు మధ్య జరిగే ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు అందజేసే పరిహారాన్ని ఈ ప్రభుత్వం ఐదు "లక్షల నుంచి పది లక్షలకు పెంచింది. దీని వల్ల, అటవీ ప్రాంతాల్లో నివసించే కుటుంటాలకు ఒక భరోసా ఉంటుంది. అడవులు మరియు పర్యావరణ శాఖకి ఈ బడ్జెట్ లో 1,064 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
ఈ ఏడాది 20.02 కోట్ల చెట్లను నాటి లక్ష్యంతో ప్రభుత్వం 'విద్రోత్సవ వన మహోత్సవం" కార్యక్రమాన్ని ప్రారంభించింది. మానవులకు, జంతువులకు మధ్య జరిగే ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు అందజేసే పరిహారాన్ని ఈ ప్రభుత్వం ఐదు "లక్షల నుంచి పది లక్షలకు పెంచింది. దీని వల్ల, అటవీ ప్రాంతాల్లో నివసించే కుటుంటాలకు ఒక భరోసా ఉంటుంది.
ఇకో టూరిజం కొరకు తెలంగాణలోని ఏడు అటవీ ప్రాంతాలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, వికారాబాద్. అనంతగిరి సర్క్యూట్, ఖమ్మం లోని కనకగిరి, అదిలాబాద్ లోని కుంటాల జలపాతం, కొత్తగూడెంలోని కిన్నెరసాని, పాకాల మరియు ఏటూరునాగారం సర్క్యూట్ లను గుర్తించాం. ఇకో టూరిజం అభివృద్ధి ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూరుతాయి.
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సుస్థిర అభివృద్ధిని సాధించడం ప్రస్తుత ప్రభుత్వ ధ్యేయం. తదనుగుణంగా మేము తీసుకువచ్చే నూతన విద్యుత్ విదానంలో సారశక్తి రంగానికి ప్రాధాన్యతనిస్తూ, భవిష్యత్తులో కాలుష్యరహిత విద్యుత్ సాధనలో నిలవడానికి కృషి చేస్తున్నాం. అగ్రగామిగా ట్రాన్స్ కో మరియు డిస్కంలకి ఈ బడ్జెట్ లో 16.410 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా ఆరోగ్య సేవలు పౌరులందరికీ అందుబాటులోనికి తెచ్చేందుకు. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగిన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును జారీ చేసే విధానాన్ని త్వరలో ప్రవేశ పెడుతున్నాం. ప్రభుత్వం ప్రారంభించే ఈ క్రొత్త డిజిటల్ పద్ధతి వల్ల చెల్లాచెదురుగా అనేక చోట్ల ఉన్న, పౌరుని
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ లో ఉన్న 1,672 చికిత్సలలో, 1,375 చికిత్సలకు ప్యాకేజీ ధరలను సగటున 20 శాతం పెంచాం. ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా 163 వ్యాధులను చేరుస్తూ దాని పరిధిని విస్తరించాం.
ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టపరదాం మా ప్రభుత్వం ఏర్పడగానే గతంలో ఉన్న 5 లక్షల కవరేజి పరిదిని 10 లక్షల రూపాయలకు పెంచాం.
ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన ఆరోగ్య సేవలు సమర్ధవంతంగా అందించాలనే లక్ష్యంతో తెలంగాణా ప్రభుత్వం (Universal Health Care) రూపకల్పన చేస్తూ కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టింది.
అసంపూర్తిగా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరియు ఇతర హాస్పటల్స్, నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తాం. క్రొత్త మెడికల్ కాలేజీలకి అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని మంజూరు చేశాం. మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 6,956 మంది నర్సులకు నియామక ఉత్తర్వులు ఇచ్చాం.
మా ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగం బలోపేతం చేసే దిశగా దానిలో పని చేసే ఉద్యోగులందరికి దైర్యం కల్పించేలా వారి వేతన బకాయిలన్నీ విడుదల చేశాం. మున్ముందు కూడా వారికి ప్రతినెల సకాలంలో జీతాలు అందించి వారి పూర్తి సామర్ధ్యాన్ని ప్రజా సేవకే వినియోగించేలా ప్రోత్సహిస్తాం.
ప్రస్తుత ప్రభుత్వ వైద్య వ్యవస్థ ప్రజా అవసరాలకు ఏమాత్రం సరిపోవడంలేదు. పైపెచ్చు ఈ రంగం చాలా నిర్లక్ష్యానికి గురైంది. ప్రకటనలకే పరిమితమైన గత ప్రభుత్వం కనీసం ఈ రంగంలో పని చేసే డాక్టర్లు, నర్సులు మరియు ఇతర ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేదు. ఉస్మానియా ఆసుపత్రి లాంటి ఘన చరిత్ర కలిగిన సంస్థని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కొత్త మెడికల్ కాలేజీలు సాదించుకొచ్చాం అని చెప్పడం తప్ప వాటికి కావలసిన వనరులు, వసతులు ఏమీ కల్పించలేదు
షెడ్యూల్డ్ కులాల, తెగల అభివృద్ధికి చట్టపరంగా కేటాయించాల్సిన నిధులు ఖచ్చితంగా అందిస్తాం. ఆ నిధులు వేరే ఎటువంటి పథకాలకు మళ్లించకుండా వంద శాతం షెడ్యూల్డ్ కులాల, తెగల కోసమే ఉపయోగిస్తాం. ఎస్సీ సంక్షేమం (SCSDF) కొరకు ఈ బడ్జెట్ లో 33,124 కోట్ల రూపాయలు మరియు ఎస్టీ సంక్షేమం (STSDF) కొరకు ఈ బడ్జెట్ లో 17,056 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
గిరిజనుల సంస్కృతి, ఆదారాలు, పండగలు అత్యంత వైవిధ్యభరితంగా ఉంటాయి. వాటిని పాటిస్తూ, కాపాడుకోవడానికి వారు ప్రాధాన్యం ఇస్తారు. అది పరిరక్షించడం మన బాధ్యత కూడా. అందుకే, ఆసియాలోనే అతి పెద్దదైన సమక్క సారాలమ్మ మేడారం జాతరని అత్యంత వైభవంగా ఫిబ్రవరి, 2024 లో 100 కోట్లతో నిర్వహించాము. అంతే కాకుండా సంత్ సేవాలాల్ జయంతి కూడా రెండు కోట్లు, నాగోబా జాతర నిర్వహణకి కోటి రూపాయలు మంజూరు చేశాం.
మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ, అభివృద్ధితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం. దానిని గుర్తించిన మా ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కొరకు పలు చర్యలు చేపట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో పాటు మైనార్టీ విద్యార్థులకు 2024-25 లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రభుత్వమే చేపట్టింది. దీనికోసం అనుభవజ్ఞులైన ఆచార్యుల సేవలను వినియోగిస్తున్నాం. శిక్షణ అత్యంత ఆధునిక విధానంలో ఇవ్వడంతో పాటు లోకల్ అభ్యర్ధులకు నెలకు 2,500 రూపాయలు నాన్ లోకల్ అభ్యర్ధులకు, 5,000 రూపాయల స్టైఫండ్ కూడా ఇస్తున్నాము.
ఈ సంవత్సరం రంజాన్ వేడుకలకు 33 కోట్ల రూపాయలు మరియు అషూర్ ఖానాల పునరుద్ధరణకు, నిర్వహణకు 50 లక్షల రూపాయలు మంజూరు చేశాం. జనవరి, 2024 లో జరిగిన తబ్లీగ్ జమాత్ ఇస్లామిక్ సమావేశానికి 2.40 కోట్ల రూపాయలు విడుదల చేశాం. ముస్లిం సోదర సోదరీమణుల హజ్ యాత్రకు 4.43 కోట్ల రూపాయలు ఈ నెలలోనే మంజూరు చేశాం. మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్ లో 3,003 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో పారిశుధ్యం, మరమ్మత్తులు, నిర్వహణ మహిళా సంఘాల ద్వారా చేపట్టాలని అనుకుంటున్నాం.. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో విద్యా ప్రమాణాలను పెంచి నాణ్యమైన విద్యను అందించాలని మా లక్ష్యం. స్త్రీ, శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్ లో 2.736 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమం ప్రజాస్వామ్యం అనేది బలవంతులకి మరియు బలహీనులకి సమాన అవకాశాలు కల్పించేది" మహాత్మగాంధీ (1 understand democracy as something that gives the weak the same chance as the strong-Mahatma Gandhi).
బాలబాలికలకు పౌష్టికాహారాన్ని అందించటంతో పాటు, విద్యను కూడా అందించాలనే సంకల్పంతో, అంగన్ వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్ మార్చాలని నిర్ణయించాం. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి, పాఠశాలల నిర్వహణను అప్పగిస్తాం.
తెలంగాణకి ఆర్థికంగా ఆయువు పట్టు అయిన హైదరాబాద్ సమగ్రాభివృద్ధి సాధించినప్పుడే పలు రంగాలకు అవసరమైన వనరులు సమకూడి రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరాభివృద్ధికి ఎన్నడు లేని విధంగా భారీ ఎత్తున 10 వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాము.
నగరానికి మంచినీటి మరియు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్స్ కి 3,385 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదించాం. ఇవి కాకుండా హైడ్రా కి 200 కోట్లు, ఎయిర్ పోర్టు, వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కొరకు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకి 500 కోట్లు, పాత నగరానికి మెట్రో విస్తరణకి 500 కోట్లు, మల్టి మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్ పోర్టు: సిస్టమ్ కొరకు 50 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కొరకు 1,500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం.
హైదరాబాద్ చుట్టు ప్రక్కల ఉన్న పెద్ద పరిశ్రమలు మరియు ఐటి సంస్థలు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వీటిలో పని చేసే వారు హైదరాబాద్ నగరం మరియు శివారు ప్రాంతాలలో నివసిస్తూ వారు పనిచేసే ప్రాంతానికి రోజు దూర ప్రయాణం చేస్తూ ఉంటారు. పనిచేసి ప్రాంతానికి దగ్గరగా నివాసాలు ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ట్రాఫిక్ రద్దీ తగ్గడం, సమయం ఆదా అవడమే కాకుండా, ఆర్థికంగా కూడా ఆదా అవుతుంది. అంతే కాకుండా, హైదరాబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతాలన్ని కూడా సెల్ఫ్ సస్టినింగ్ (Self Sustaining) ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతాయి.
మితిమీరిన కాలుష్యంతో మూసీ, హుస్సేన్ సాగర్ లు విషతుల్యం అయ్యాయి. మురికి నీటి కాలువల నిర్వహణ లోపంతో, ఆక్రమణలతో చినుకు పడితే నగరం జలమయమై ప్రజాజీవనం అస్తవ్యస్తం అయ్యే పరిస్థితి దాపురించింది. దూరదృష్టి లేని ప్రణాళికలు, ఇబ్బడిముబ్బడి అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించకపోవడంతో నగరాభివృద్ధి కుంటుపడింది. కేవలం కొన్ని ప్లై ఓవర్లు నిర్మించి దానినే అభివృద్ధిగా భ్రమింప చేశారు. హైదరాబాద్ లో భూముల వేలం ద్వారా వేల కోట్లు సమకూరినా, వాటి వినియోగం మాత్రం నగరాభివృద్ధి కొరకు జరుగలేదు.
దేశంలోని ప్రధాన నగరాలలో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం. ఇప్పటికే ఈ నగరం ఒక ఐకాన్ గా పేరు గడించింది. ఈ నగరాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వాల సేవలను మనము మర్చిపోలేము. ఇంతటి ఘన చరిత్ర కలిగిన నగరం యొక్క పారిశుధ్య, మురుగు నీటి, తాగునీటి వ్యవస్థలు గత పదేళ్ళుగా అత్యంత నిర్లక్ష్యానికి గురైయ్యాయి.
మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించినప్పుడే వారు నిజమైన సమానతను సాధిస్తారు. పైన పేర్కొన్న పథకాలన్నీ కూడా ఈ దిశగా మహిళలను బలోపేతం చేసేవే. సంక్షిప్తంగా చెప్పాలంటే మా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కంకణం కట్టుకుంది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్ లో 29,816 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.
స్కూల్ యూనిఫాంలను కుట్టే పనిని స్వయం సహాయక బృందాల మహిళా సభ్యులకు అప్పజెప్పాలని పాఠశాల విద్యా శాఖను, సంక్షేమ శాఖను, జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అందిన అభ్యర్ధనల మేరకు స్కూల్ యూనిఫాంల కుట్టు దార్జీలను జతకు 50 రూపాయల నుండి 75 రూపాయలకు పెంచడం కూడా జరిగింది. దీనివల్ల, 29,680 మహిళా సభ్యులకు సుమారు 50 కోట్ల రూపాయల లబ్ది చేకూరుతుందని అంచనా.
ఇందిరా జీవిత బీమా ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నాము. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 10 లక్షల జీవిత బీమా చేయడం జరిగింది.
స్వయం సహాయక బృందాలలోని మహిళా సభ్యులు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి గాను మాదాపూర్ లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీని ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) కు 3.20 ఎకరాల భూమిలో గల 106 దుకాణాలతో కూడిన నైట్ బజారు కాంప్లెక్స్ ను అప్పగించాం. మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించినప్పుడే వారు నిజమైన సమానతను సాధిస్తారు. పైన పేర్కొన్న పథకాలన్నీ కూడా ఈ దిశగా మహిళలను బలోపేతం చేసేవే. సంక్షిప్తంగా చెప్పాలంటే మా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కంకణం కట్టుకుంది.
మహిళలు సాధించిన ప్రగతే, ఆ సమాజ ప్రగతికి కొలమానంగా అని భావిస్తున్నాం (I measure the progress of the community by the degree of progress which women have achieved- Dr.B.R.Ambedkar) తెలంగాణా ప్రభుత్వం 63 లక్షల మహిళలను విజయవంతమైన వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే ధ్యేయంతో "ఇందిరా మహిళా శక్తి" పదకానికి రూపకల్పన చేసింది. స్త్రీ నిది ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం అనే మార్గాల ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ఈ లక్ష్యం సాధిస్తాం.
కర్ణాటక రాష్ట్రాన్ని సంప్రదించి నారాయణ పూర్ డ్యాం నుండి రెండు టిఎంసిల నీటిని రాబట్టుకోగలిగాం. కొత్త బోర్లను, హ్యండ్ పంపులను సమకూర్చి ములుగు, భద్రాద్రి జిల్లాల లోని 35 గుత్తికోయ నివాసాలకు త్రాగునీటిని సరఫరా చేసి చిరకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించాం. నీటి వసతులకు సంబంధించిన వివిధ నిర్మాణాల నిర్వహణ మరియు మరమ్మత్తులను గ్రామ పంచాయితీల పరిధిలోనికి తీసుకురావాలని నిర్ణయించాం.
మా ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత త్రాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి పలు ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే, వేసవి తీవ్రతను పసిగట్టి ప్రత్యేక అభివృద్ధి నిధి నుండి, గ్రామ పంచాయితీ నిధి నుండి మరియు 15 వ ఆర్థిక సంఘం కేటాయింపుల నుండి తగినంత మొత్తాన్ని సమీకరించి త్రాగు నీటి ఎద్దడిని సమర్ధవంతంగా పరిష్కరించగలిగాం.
బియ్యం విషయంలో జరుగుతున్న అవకతవకలను గుర్తించి వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నాము. గత ఆరు నెలలుగా విజిలెన్స్ విభాగం మిల్లర్లపై దాడులు చేస్తూ బకాయిలు రాబట్టింది. ప్రభుత్వ కృషి వలన గత ఆరు నెలల్లో బకాయిపడ్డ కస్టమ్ మిల్లర్స్ నుండి 450 కోట్లు రాబట్టాము.