NTV Telugu Site icon

Telangana Assembly 2024: నేడు తిరిగి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ..

Telangana Assembly

Telangana Assembly

Telangana Assembly 2024: రాష్ట్ర శాసనసభ సమావేశాలు నేటి (సోమవారం) నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల (డిసెంబర్) 9న శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కాగా, తొలిరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆ అంశంపై ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించిన అనంతరం సభలు 16వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. అనంతరం పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెడతారు. అనంతరం తెలంగాణ యువభారతి ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. శాసనసభలో కూడా ఇదే అంశంపై చర్చ జరగనుంది.

Read also: Allu Arjun: వివాదాల వేళ.. బన్నీ ఆకాశమే నీ హద్దు.. జనసేన నేత ఆసక్తికర కామెంట్స్

సోమవారం జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో శాసనసభ, మండలి ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈసారి దాదాపు వారం రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో రైతు భరోసా విధివిధానాలపై చర్చ జరగనున్నట్లు తెలిసింది. కొత్త ROR 2024 చట్టాన్ని కూడా తీసుకురానున్నట్లు సమాచారం. అసెంబ్లీ, మండలిలో ముఖ్యమంత్రి ఆధీనంలో ఉన్న శాఖలకు సంబంధించిన బిల్లులు, సమాధానాలు, ఇతర అంశాలను సీఎం తరపున ప్రవేశపెట్టడం, సమాధానాలు ఇవ్వడం, నోట్ చేసుకోవడం వంటి బాధ్యతలను కొందరు మంత్రులకు అప్పగించారు.

Read also: Allu Arjun: వివాదాల వేళ.. బన్నీ ఆకాశమే నీ హద్దు.. జనసేన నేత ఆసక్తికర కామెంట్స్

సీఎం తరపున సమాధానాలు ఇవ్వనున్న మంత్రులు వీరే..

* మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్, లా శాఖలను శ్రీధర్ బాబుకు అప్పగించారు.
* జూపల్లి కృష్ణారావుకు వాణిజ్య పన్నుల శాఖ,
* దామోదర రాజనర్సింహకు విద్యాశాఖ,
* హోం, జైళ్లు, అగ్నిమాపక సేవలు, కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీలు, నైపుణ్యాభివృద్ధి శాఖలు పొన్నం ప్రభాకర్‌కు,
* సీతక్కకు మైనారిటీ సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి, ఎస్టీ సంక్షేమ శాఖలు,
* కొండా సురేఖకు దివ్యాంగుల సంక్షేమం, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలను అప్పగించారు.
Manchu Family: మంచు కథా చిత్రమ్.. పోలీసులకు ఫిర్యాదు చేయనున్న మనోజ్

Show comments