Telangana Assembly Sessions 2024: ఇవాల్టి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ తొలిరోజు 5 కీలక బిల్లులతో పాటు, 2 నివేదికలను సభలో ప్రవేశ పెట్టనున్నారు. ముందుగా.. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరుగనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రేవంత్ రెడ్డి పలు సూచనలు చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్న సీఎం. ఇక సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా సభలో సీఎం ప్రస్తావించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సభలో ప్రకటన చేయనున్నారు. విగ్రహ మార్పుపై సభలో సీఎం రేవంత్ వివరించనున్నారు.
మొదటి రోజు చర్చించాల్సిన అంశాలు
ఈ సెషన్లలో కొత్త ROR చట్టం ప్రవేశపెట్టబడుతుంది. కొత్త గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ బిల్లుపైనే ఉంది. దీంతో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వంలో విలీనం చేసి సెకండరీ హెల్త్ డైరెక్టరేట్‌గా మార్చే బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జీతాల చెల్లింపు, పెన్షన్లు, అనర్హుల తొలగింపు (సవరణ) ఆర్డినెన్స్ 2024, తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ల (సవరణ) ఆర్డినెన్స్ 2024 ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ కార్పొరేషన్ (సవరణ) ఆర్డినెన్స్ 2024. తెలంగాణ వస్తువుల సేవల పన్ను (సవరణ) ఆర్డినెన్స్ 2024, తెలంగాణ విద్యుత్తు ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 2022-23 సంవత్సరానికి 9వ వార్షిక నివేదిక ఇవ్వనున్నారు. తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2021-22 సంవత్సరానికి 7వ వార్షిక నివేదిక, తెలంగాణ పంచాయతీరాజ్ (సవరణ) ఆర్డినెన్స్ 2024 సభలో చర్చించే అవకాశం ఉంది.
తెలుగు తల్లి విగ్రహ ఆవిష్కరణ..
సాయంత్రం 6 గంటలకు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ నిర్వహించనున్నారు. లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సభ జరగనుంది. జయ జయహే తెలంగాణ కవి అందే శ్రీ, విగ్రహ రూపకర్త ప్రో.గంగాధర్, రమణారెడ్డిలకు వేదిక మీద ప్రభుత్వం తరుపున సన్మానం చేయనున్నారు. తెలంగాణలో ప్రజల పక్షం వహించిన ఐదారుగురు కవులకు ప్రభుత్వం సత్కరించనుంది. బండి యాదగిరి,గూడ అంజన్న, జయరాజ్, గద్దర్ కుటుంబం లాంటి కవులకు సముచితంగా గౌరవించాలని ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎంపిక చేసిన వారిలో మరణించిన కవుల కుటుంబాలకు.. కవులుగా గౌరవించే అవకాశం ఉంది.
Counting Day: నేడు టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు