Telangana Assembly: ఇవాళ తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభంకానుంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. అనంతరం ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఆతరువాత స్పీకర్ ఎన్నిక ముగిసిన తర్వాత క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నారు. గవర్నర్ ప్రసంగంపై క్యాబినేట్ లో చర్చ జరగనుంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 15వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 16వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని శాసనసభ, మండలిలో విడివిడిగా ప్రవేశపెట్టి చర్చిస్తారు. 17న కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి.
Read also: Adilabad Rims: ఆదిలాబాద్ రిమ్స్ లో ఉద్రిక్తత.. సీఐ ఏమన్నారంటే..
తెలంగాణ మూడో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ మిగతా సభ్యులతో ప్రమాణం చేయనున్నారు. ఇవాళ ఎమ్మెల్యేలుగా కడియం శ్రీహరి ,కేటీఆర్ ,పల్లా రాజేశ్వర్ రెడ్డి,కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఆయనతో ప్రమాణం చేస్తారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగాన్ని స్పీకర్ శుక్రవారం ప్రకటించనున్నారు. స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగే అవకాశం ఉందని శాసనసభ వర్గాలు తెలిపాయి. స్పీకర్ ఎన్నిక దృష్ట్యా శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని మంత్రి మండలి ఆమోదించనుంది. కాగా, మరో ఆరుగురు మంత్రులు ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మరో ముగ్గురు మంత్రులు ఉన్నారు.
Adilabad Rims: ఆదిలాబాద్ రిమ్స్ లో ఉద్రిక్తత.. సీఐ ఏమన్నారంటే..