తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దు చేశారు. అయితే ఇవాళ శాసనసభ “భూ భారతి” బిల్లుపై చర్చతో ప్రారంభమైంది. ఆ తర్వాత రైతు బీమా పాలసీలపై లఘు చర్చ జరగనుంది. జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీరాజ్ సవరణ బిల్లులను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. మండలిలో రైతు బీమా పాలసీలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
-
భూ భారతి బిల్లుకు శాసన సభ ఆమోదం..
భూ భారతి బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. అనంతరం.. అసెంబ్లీ కూడా రేపటికి వాయిదా పడింది.
-
సభాపతి మీదనే దాడి చేసి చర్చను అడ్డుకునే ధోరణిలో ఉంది- సీఎం..
ప్రధాన ప్రతిపక్షం అహంభావంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సభాపతి మీదనే దాడి చేసి చర్చను అడ్డుకునే ధోరణిలో ఉందని తెలిపారు. సహనం కోల్పోయి చర్యలకు దిగాల్సి ఉన్నా.. మీరు ఓపిక పట్టారు.. బీఆర్ఎస్ సభ్యులు చర్చ పక్కదారి పట్టించేలా చేశారు.. వాళ్లకు వాళ్ళే సహనం కోల్పోయి.. సహకరించే పరిస్థితి తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
-
బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పాటు ప్రజల గొంతు నొక్కేశారు- కూనంనేని..
బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పాటు ప్రజల గొంతు నొక్కేశారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తమ గొంతు నొక్కే అధికారం మీకు ఎవరిచ్చారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎవరిని మాట్లాడనివ్వలేదు.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరిని మాట్లాడనివ్వడం లేదని తెలిపారు. గతంలో రేవంత్ రెడ్డిని 5 నిమిషాలు కూడా మాట్లాడనిచ్చేవారు కాదని అన్నారు. తాము అనుకున్నట్లుగానే సభ నడవాలని బీఆర్ఎస్ అనుకుంటోంది.. సభలో బీఆర్ఎస్ సభ్యుల తీరు బాగోలేదని కూనంనేని పేర్కొన్నారు.
-
శాసన మండలి రేపటికి వాయిదా..
తెలంగాణ శాసన మండలి రేపటికి వాయిదా పడింది.
-
శాసనసభలో బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగిన అక్బరుద్దీన్..
శాసనసభలో బీఆర్ఎస్‌పై అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల కోసమా..? కుటుంబం కోసం పోరాటం చేస్తున్నారా? అని దుయ్యబట్టారు. తాము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని అక్బరుద్దీన్ అన్నారు. మీ కుటుంబం కోసం అసెంబ్లీలో పోరాటం ఏమిటి..? అని ప్రశ్నించారు. ముమ్మాటికీ ధరణిలో అక్రమాలు జరిగాయి.. ధరణి కేవలం కేసీఆర్ కుటుంబం కోసం తీసుకొచ్చారని ఆరోపించారు. 10 ఏళ్ళు తెలంగాణలో కచరా గవర్నమెంట్ ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల కోసం వచ్చారా...? లేక కేసీఆర్ కుటుంబం కోసం వచ్చారా..? అక్బరుద్దీన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అవసమైతే సభ నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయండి.. అసెంబ్లీలో సభ్యులు అనుసరించే వ్యూహం ఇదేనా...? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పాలని అక్బరుద్దీన్ తెలిపారు.
-
ప్రతిపక్ష నేత సభకు రాడు - పొంగులేటి
ప్రతిపక్ష నేత సభకు రాడని, రౌడీల లెక్క వీల్లను సభకు పంపుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సభ్యుల ప్రవర్తన ఎలా ఉందో చూడండి అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఉబలటానికి సీఎం విచారణకు ఆదేశం- పొంగులేటి
ఫోరెన్సిక్ అడిట్ చేస్తామన్నారు. ధరణిలో అవకతవకలపై అడిట్ కి విచారణ చేపట్టామన్నారు. ఓఆర్ఆర్ నీ రద్దు చేయండి అని హరీష్..కేటీఆర్ అడిగారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఉబలటానికి సీఎం విచారణకు ఆదేశించారన్నారు.
-
ఇచ్చిన మాట ప్రకారం ధరణి రద్దు చేశాం - పొంగులేటి
ఇచ్చిన మాట ప్రకారం ధరణి రద్దు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లోపభూయిష్టమైన చట్టం రద్దు చేశామన్నారు. భూ భారతి చట్టం చేశాం...పేదలకు న్యాయం చేస్తున్నామని మంత్రి అన్నారు. ఇది ప్రజల చట్టం అని అన్నారు.
-
బీఆర్ఎస్ సభ్యులు సహకరించాలి- మంత్రి శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ సభ్యులు సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏ లు, ఎంఐఎంలు, సీపీఐ ఫ్లోర్ లీడర్ల ముందు కూడా నిరసన చేయడం ఏంటి..? అని ప్రశ్నించారు. ఇదేం పద్ధతి అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
ఆందోళన మధ్య కొనసాగుతున్న సభ
బీఆర్ఎస్ ఆందోళన మధ్య సభ కొనసాగుతుంది. భూ భారతి పై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు
-
విరామం అనంతరం ప్రారంభమైన సభ
విరామం అనంతరం అసెంబ్లీ ప్రారంభమైంది. సభలో కొనసాగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన
-
మహేశ్వర రెడ్డి స్పీచ్ ను అడ్డుకున్న బీఆర్ఎస్ ఎంఎల్ఏ లు
సభలో బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి స్పీచ్ ను బీఆర్ఎస్ ఎంఎల్ఏ లు అడ్డుకున్నారు. మహేశ్వర రెడ్డి మాట్లాడుతుండగా బడే బాయి చోటే భాయి అంటూ నినాదాలు చేశారు. దీనిపై బీజేపీ నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. పదే పదే డిస్టర్బ్ చేస్తే ఎలా మాట్లాడాలి ? అని ప్రశ్నించారు. సభను ఆర్డర్ లో పెట్టాలని స్పీకర్ ను కోరిన ఏలేటి కోరారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏ లు నినాదాలు ఆపకపోవడంతో సభను స్పీకర్ 10 నిమిషాలు వాయిదా వేశారు.
-
శాసన మండలిలో టీ విరామం
శాసన మండలిలో టీ విరామం
-
తెలంగాణ అసెంబ్లీకి విరామం
తెలంగాణ అసెంబ్లీ మళ్ళీ విరామం.. 10 నిమిషాల పాటు అసెంబ్లీని వాయిదా వేసిన స్పీకర్
-
ధరణి పోర్టల్ వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది- బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
భూ కుంభకోణం అంటున్నారు ... దానిపై సీబీఐ విచారణకి ఎందుకు ఆదేశించడం లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. ఎన్నో కుంభకోణాలు జరిగాయని భట్టి చెప్పారు.. ఎందుకు సీబీఐ విచారణకు ఇవ్వడం లేదన్నారు. పార్ట్ బీలో ఉన్న భూమి 18 లక్షల 40 వేల ఎకరాలు .. పార్ట్ బీలో ఉన్న భూమి ఇష్యూ ఎలా పరిష్కరిస్తారన్నారు.
-
దీని మీద చర్చ ఇక్కడ ఏముంది- స్పీకర్
ఈకార్ పై అసెంబ్లీలో చర్చ ఏముందని స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రశ్నించారు. గవర్నర్ అనుమతి ఇచ్చారు.. ఏసీబీ కేసు పెట్టిందని తెలిపారు.
-
ప్రజల సమస్యలు..సంక్షేమం అవసరం లేదా..? మంత్రి శ్రీధర్ బాబు
ప్రజల సమస్యలు..సంక్షేమం అవసరం లేదా..? అని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. బీఏసీలో బీఆర్ఎస్ 9 అంశాలు ఇచ్చారన్నారు. ఈ ఫార్మా మీద చర్చ కావాలని ఎందుకు పెట్టలేదన్నారు.
-
శాసన సభలో జరిగిన ఘటనల పుటేజ్ ను బయట పెట్టాలి- తలసాని
శాసన సభలో జరిగిన ఘటనల పుటేజ్ ని బయట పెట్టాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అన్నారు. ఆరు గ్యారంటీల పై మేము ప్రభుత్వాన్ని నియాలదీస్తుంటే.. మా సీనియర్ ఎమ్మెల్యే కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. దేశంలో ప్రధాన సమస్య ఈ కార్ రేసు పై చర్చ పెట్టాలని అంటున్నామన్నారు.
-
సభలో చెప్పు చూపించారు.. మాట్లాడితే తాగి వచ్చామని ఆరోపణలు- తలసాని
సభలో మాకు చెప్పు చూపించారని, మేము మాట్లాడితే తాగి వచ్చామని ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇప్పుడు ప్రభుత్వ డాక్టర్ ను పిలిపించి ఆల్కహాల్ పరీక్ష చేయించాలన్నారు. మేమందరం టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
-
అసెంబ్లీ లో జరిగిన రచ్చపై సీఎం రేవంత్ ఆరా..
అసెంబ్లీ లో జరిగిన గలాటా పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సభలో సభ్యుల ప్రవర్తనకి స్పందించిన సీఎం.. వీడియోలు విడుదల చేసే అవకాశం ఉంది.
-
సభలో జరిగిన ఘటన దురదృష్టకరం - పొంగులేటి శ్రీనివాస్
సభలో జరిగిన ఘటన దురదృష్టకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. సీనియర్ సభ్యులు... మీ మీదకు వచ్చి అలా చేయడం కరెక్ట్ కాదన్నారు. సభ్యుల ప్రవర్తన గుండాగిరి సరికాదన్నారు. రౌడీయిజం సరికాదని, దీన్ని కట్టడి చేయండని తెలిపారు మంత్రి.
-
సభను తప్పుదోవ పట్టించొద్దు- స్పీకర్
సభ తప్పుదోవ పట్టించొద్దని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. భూ భారతి ఇంపార్టెంట్ అన్నారు. ఓ వ్యక్తి సమస్య నీ ఇష్యూ చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. బిల్లుపై చర్చ ముగిసిన తర్వాత నా ఛాంబర్ కి పిలుస్తా అన్నారు.
-
వాయిదా అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ
15 నిమిషాల వాయిదా అనంతరం అసెంబ్లీ ప్రారంభమైంది.