Harish Rao: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్ హాట్ గా కొనసాగాయి. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ సందర్భంగా సభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మాట్లాడుతూ.. ఒక్క నిమిషం వినండి.. అందరి సభ్యులకు హక్కులు ఉంటాయి.. అందరి హక్కులు కాపాడాలి.. బీఏసీ సమావేశం అజెండాను సభలో పెట్టారు.. అందులో ఏడు రోజులు సభ అనుకున్నాం.. కానీ, అజెండాలో లేదు.. సెట్ చేయండి అని ఆయన సూచించారు. బిజినెస్ ఎప్పుడూ అనేది ముందు చెప్పండి.. 24 గంటల ముందు పంపడం నేర్చుకోండి అన్నారు. సభలో మాకు ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది అని హరీష్ రావు పేర్కొన్నారు.
Read Also: Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే బీఆర్ఎస్ మనుగడ సాధ్యం..
ఇక, అసెంబ్లీలో మాకు మైక్ ఇవ్వకపోవడం సరికాదు అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువగా ఉంది అని విమర్శించారు. దీంతో హరీష్ రావు మైక్ ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కట్ చేశారు. సీఎంను తిడుతా అంటే మైక్ ఇవ్వను అని తేల్చి చెప్పారు. హరీష్ రావు ప్రశ్న పై మాట్లాడండి అని సూచించారు. ఇక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడితే ఎందుకు ఆపలేరు అని స్పీకర్ ని హరీష్ రావు ప్రశ్నించడంతో కాసేపు సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో ప్రభుత్వ చీప్ విప్ ఆది శ్రీనివాస్ హరీష్ రావుకి కౌంటర్ ఇచ్చారు. సీఎంపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. హరీష్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని విప్ శ్రీనివాస్ చెప్పారు. దీంతో అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోవడంతో సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.