Telangana Assembly 2024: ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. నేడు తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై చర్చ కొనసాగనుంది. ఇవాళ ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని రద్దు చేసి అబడ్జెట్ పై చర్చించనున్నారు. 19 శాఖల పద్దుల పై చర్చ కొనసాగనుంది. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ సభలో జరిగే చర్చలో పాల్గొనేందుకు సభ్యులు బడ్జెట్ ను అధ్యయనం చేసి శుక్రవారం సెలవు ప్రకటించారు. అనంతరం శనివారం ఉభయ సభల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ ప్రారంభమైంది.
Read also: Krishna : ఘట్టమనేని అభిమానులకు చేదు వార్త..ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు హఠాన్మరణం..
అయితే అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా కొనసాగింది. అయితే ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేసి నేరుగా బడ్జెట్ పై చర్చకు అవకాశం కల్పించారు. దీంతో హరీష్ రావు బడ్జెట్ పై ప్రశ్నించారు. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హరీష్ రావు మాటకు మాట కొనసాగింది. దీంతో శనివారం అసెంబ్లీలో వాడివేడి చర్చలు కొనసాగాయి. కాగా.. సమావేశాల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య రసవత్తరంగా చర్చ జరిగింది. మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య ఏకంగా మాటల యుద్ధమే జరిగింది. ఒకానొక దశలో వ్యక్తిగత దూషణలు సైతం చేసుకున్నారు. అయితే.. శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి స్పీకర్ వాయిదా వేశారు. ఇవాళ తిరిగి ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Free Bus Scheme in AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. నేడు సీఎం చంద్రబాబు కీలక సమీక్ష..