ACB: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. అవినీతి, అక్రమాస్తుల కేసుల నమోదుతో దూసుకెళ్తుంది. కేవలం 2025 ఏప్రిల్ నెలలో మొత్తం 21 కేసుల నమోదు అయ్యాయి. 13 ఏసీబీ ట్రాప్ కేసులు, 2 అక్రమాస్తుల కేసులు, 2 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 2 ఆశ్చర్యపరిచే తనిఖీ కేసులు, 2 సాధారణ కేసులు చేసినట్లు ప్రకటించింది. 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్, రిమాండ్ చేయబడ్డారు.
Read Also: Triple Talaq: ఫోన్‌లో “ట్రిపుల్ తలాక్” చెప్పిన భర్త.. భార్య ఆత్మహత్య..
కాగా, 5. 02 లక్షల సొమ్మును ఏసీబీ సీజ్ చేసింది. ఒక అధికారి ఇంట్లో సోదాలు చేసి 3.51 కోట్ల రూపాయల అక్రమాస్తులను గుర్తించింది. మాజీ ENC హరిరామ్ అక్రమాస్తులు మార్కెట్ వాల్యూ ప్రకారమ్ 13.50 లక్షల ఆస్తులుగా గుర్తించారు. లంచం డిమాండ్ చేస్తే 1064 కాల్ చేయాలని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు పేర్కొన్నారు.
