Site icon NTV Telugu

Crime: నిన్న భార్య ఆత్మహత్య.. నేడు శవమై కనిపించిన భర్త

Hyd

Hyd

Crime: హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. రిలయన్స్ డిజిటల్ షో రూమ్ దగ్గర రక్తం మడుగులో పడి ఉన్న మృతదేహం లభ్యమైంది. అయితే, హయత్ నగర్ లోని ముద్దిరాజ్ కాలనీకి చెందిన నగేష్ గా గుర్తించారు. నగేష్ ను హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా.. లేదా అక్కడే హత్య చేశారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, మృతుడి తలకు, చేతులకు, కాళ్లకు కత్తి గాయాలు ఉన్నట్లు గుర్తించారు. కాగా, మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించి.. క్లూస్ టీమ్ తో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Tamilisai: తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసైకి పితృవియోగం

అయితే, నగేష్ భార్య శిరీష నిన్న ఆత్మహత్య చేసుకుంది. భార్య సూసైడ్ చేసుకోవడంతో భర్త నగేష్ ను మంగళవారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, పోలీసుల అదుపులో ఉన్న నగేష్ ను రాత్రి జామీను మీద బయటికి తీసుకొచ్చిన బంధువులు.. శిరీష ఆత్మహత్యతో భర్త నగేష్ పై ఆగ్రహంతో ఉన్న మృతురాలి బంధువులు హత్య చేశారా?.. లేదంటే, భార్య ఆత్మహత్యతో నగేష్ సూసైడ్ చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Exit mobile version