Site icon NTV Telugu

Bhatti Vikramarka: సుప్రీంకోర్టులో ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించాం.. రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం..

Bhatti V

Bhatti V

Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టులో కేసు విచారణలో ఉండగా మళ్లీ ఇక్కడకు ఎందుకు వచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టులో స్టే ఇవ్వడానికి నిరాకరించిందని బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన లాయర్ తెలిపారు. హైకోర్టులో స్టే ఇవ్వాడానికి నిరాకరిస్తే ఇక్కడకు వస్తారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బీపీ రిజర్వేషన్లపై అక్కడికే వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కేసు డిస్మిస్ అని చెప్పడంతో.. పిటిషనర్ తరపు న్యాయవాది ఈ కేసును వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు.

Read Also: Gudivada Amarnath: స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మేం ఎప్పుడూ వ్యతిరేకమే..

అయితే, సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును న్యాయస్థానం కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నాం.. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తాం.. ఇప్పటికే ప్రభుత్వం 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్ ఒక జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసింది.. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాం.. 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరితో ఉన్నాం.. ఈ రిజర్వేషన్ల కోసం జీవో కూడా విడుదల చేశాం.. మా నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Exit mobile version