Harish Rao Vs Speaker: ఫార్ములా-ఇ కార్ రేస్ అంశంపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించారు. ఈరోజు అసెంబ్లీలో భూ భారతి బిల్లుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముందుగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వం అక్రమ కేసు పెట్టిన ఈ-కార్ రేస్‌పై సభలో చర్చ జరపాలని మాజీ మంత్రి హరీష్ రావు పట్టుబట్టారు. దీనిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందిస్తూ.. ఒక్క సభ్యుడి కోసం సభా సమయాన్ని వృధా చేయడం సరికాదన్నారు.
మండలిలో కొందరు మంత్రులు ఉన్నారని, సంబంధిత మంత్రి అసెంబ్లీకి రాగానే మీ ప్రశ్నకు సమాధానం చెబుతానని స్పీకర్ అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ బిల్లు ముఖ్యమని, భూభారతి బిల్లుపై చర్చ ముగిసిన తర్వాత స్పీకర్ ఛాంబర్‌లో మాట్లాడాలని స్పీకర్ స్పష్టం చేశారు. సంబంధిత మంత్రి లేకపోవడంతో ఇది సాధ్యం కాదన్నారు. సీనియర్ శాసనసభ్యుడు హరీష్ రావు ఇలా ప్రవర్తించడం సరికాదని స్పీకర్ చురకలంటించారు. సభ అనంతరం ఛాంబర్‌కు పిలుస్తామని చెప్పారు. సభా సమయాన్ని వృథా చేయడం సరికాదన్నారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని స్పీకర్ అన్నారు.
KTR: కేసు విషయంలో నేనేం భయపడడం లేదు..