Hyderabad Crime: హైదరాబాద్‌లో వరుస క్రైమ్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి.. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది.. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు.. గచ్చిబౌలిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. అర్ధరాత్రి సమయంలో ఆటో వెళ్తున్న యువతిపై కన్నేసిన కామాంధులు.. ఆటోలోనే ఆమెపై అత్యాచారాకి ఒడిగట్టారు.. ఆటో డ్రైవర్‌తో పాటు.. మరో యువకుడు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిన్న అర్ధరాత్రి ఆర్‌సీ పురం వద్ద ఆటో ఎక్కింది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి.. ఆ ఆటో అర్ధరాత్రి 2:30 సమయంలో మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది.. అయితే, మసీద్ బండ దగ్గరకు ఆటో చేరుకోగానే.. తనపై ఆటో డ్రైవర్‌తో పాటు మరో యువకుడు.. ఆటోలోనే అత్యాచారం చేశారని గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.. తనపై అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం మసీద్ బండ దగ్గర వదిలి పారిపోయారని ఫిర్యాదులో తెలిపింది యువతి.. ఇక, కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.. అయితే, హైదరాబాద్‌లో ఓవైపు అఘాయిత్యాలు.. మరోవైపు మర్డర్‌లు వరుసగా వెలుగు చూస్తున్న వేళ.. మరో ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది..