Lorry Accident: హబ్సిగూడలో నిన్న సాయంత్రం లారీ ప్రమాదానికి గురి అయిన బాలిక కామేశ్వరి సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Read also: CM Revanth Reddy: కవిత బెయిల్‌పై చేసిన వ్యాఖ్యల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్
హబ్సిగూడలో లారీ ఢీకొని ఆరో తరగతి విద్యార్థి మృతి చెందింది. తార్నాక డివిజన్ హనుమాన్ నగర్ స్ట్రీట్ నెం.12లో నివాసముంటున్న సంతోషి, నీల్‌కుమార్ దంపతుల పెద్ద కుమార్తె కామేశ్వరి(10) ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. కుమారుడు వేదాంష్ కూడా అదే పాఠశాలలో చదువుతున్నాడు. ఎప్పటిలాగే సంతోషి మధ్యాహ్నం పాఠశాల నుంచి పిల్లలను తీసుకుని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరింది. హబ్సిగూడలో వీరి ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వెళుతున్న లారీ ఢీకొట్టడంతో కిందపడిపోయారు. కామేశ్వరిపై నుంచి లారీ దూసుకెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే కామేశ్వరి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లారీ డ్రైవర్ మియారం జుట్ (40)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక కామేశ్వరి సీసీ ఫుటేజీ వెలుగులోకి రావడంతో.. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలంలో కూతురిని పట్టుకుని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులకు కంటతడి పెట్టించింది.
Dengue Fever: జిల్లాలో డెంగ్యూ జ్వరాలు.. రెండు నెలల్లో 714 కేసులు