Deputy CM Bhatti: సెక్రటేరియట్ లో బొగ్గు బ్లాక్స్ వేలంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణికి కలిగే ప్రయోజనాలు అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఇతర మినరల్స్ వేలంలో పాల్గొనాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుంది.. సింగరేణి కాలరీస్ తెలంగాణ రాష్ట్రానికి ఆత్మ లాంటిదన్నారు. ఉద్యోగ గని సింగరేణి.. సింగరేణి కాలరీస్ ద్వారా ప్రజలకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి.. దీని ద్వారా బ్రతకగలం అనే నమ్మకాన్ని కల్పిస్తుంది.. అదనపు గనులు రాకపోవడం వల్ల నష్టం జరుగుతుంది అన్నారు. ఇంకా గనులు పెంచుకోవాల్సిన అవసరం సింగరేణికి ఉంది అని ఉప ముఖ్యమంత్రి భట్టి పేర్కొన్నారు.
Read Also: Asia Cup 2025: పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు.. భారత జట్టును వీడిన స్టార్ ప్లేయర్!
ఇక, కాఫర్, గోల్డ్ గనుల వేలంలో సింగరేణి పాల్గొనింది అని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. గనులు దక్కించుకుంది, లైసెన్స్ పొందింది.. రాయచూరులో ఉన్న గనుల్లో 37.7 శాతంతో సింగరేణి ఎక్స్ ప్లోర్ లైసెన్స్ పొందింది.. క్రిటికల్ మినరల్స్ లో కూడా సింగరేణి ప్రవేశించాలి.. అందుకోసం ఒక కన్సల్టెన్సీ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం.. దేశంలో దొరికే మినరల్స్ పై పరిశీలన చేసి నివేదిక అందిస్తుంది.. గ్రీన్ ఎనర్జీపై కూడా సింగరేణి దృష్టి పెట్టింది.. ఫ్లోటింగ్ సోలార్ ఇప్పటికే పెట్టింది.. గ్రీన్ హైడ్రోజన్ పై కూడా దృష్టి సారిస్తుంది.. త్వరలోనే సింగరేణి సంస్థ గ్లోబల్ కాబోతోంది.. వేలంలో పాల్గొనకపోవడం వల్ల సంస్థకు నష్టం జరుగుతుందని కార్మిక సంఘాలు వినతిపత్రం సమర్పించాయి.. బొగ్గు బ్లాక్స్ వేలంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణికి కలిగే ప్రయోజనాలు అనే అంశంపై సీఎండీ బలరాం ప్రజెంటేషన్ ఇస్తున్నారని ఉప ముఖ్యమంత్రి విక్రమార్క వెల్లడించారు.
