NTV Telugu Site icon

Minister Seethakka: పార్లమెంట్ లో అల్లూరి విగ్రహంపై కేంద్రానికి సీతక్క విజ్ఞప్తి..

Minister Seetakka

Minister Seetakka

Minister Seethakka: అల్లూరి విగ్రహ ఏర్పాటు కోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేలా తెలుగు రాష్ట్రాల ఎంపీలు కృషి చేయాలని మంత్రి సీతక్క తెలిపారు. ట్యాంక్ బండ్ మీద జరుగుతున్న అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో సీతక్క పాల్గొన్నారు. అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జోహార్ అల్లూరి సీతారామరాజు జోహార్లు అంటూ సీతక్క నివాళులు అర్పించారు. కొనసాగిస్తాం అల్లూరి ఆశయాలను అంటూ నినదించారు. దేశాన్ని పట్టిపీడించిన బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు అల్లూరి అన్నారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రజలందరినీ ఏకం చేసిన చేసిన మహనీయుడు అల్లూరి అని తెలిపారు.

Read also: Thummala Nageswara Rao: ఆఫీస్‌ ఖాళీ.. నిన్న కోమటి రెడ్డి.. నేడు తుమ్మల.. ఆకస్మిక తనిఖీలు..

అలాంటి వీరుడి 127 జయంతి వేడుకలను నిర్వహించిన క్షత్రియ సేవా సమితి సభ్యులకు అభినందలు తెలిపారు. అల్లూరి అంటేనే ఒక పోరాటం, ఒక వెలుగు, ఒక స్ఫూర్తి అన్నారు. అడవి బిడ్డల హక్కుల కోసం పోరాటం చేసి కన్నుమూసిన అమరజీవి అల్లూరి ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. ఆయన ఆశయాలను భవిష్యత్ తరాలు కొనసాగించాలన్నారు. పార్లమెంట్ లో మన్యం వీరుడు అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అల్లూరి విగ్రహ ఏర్పాటు కోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేలా తెలుగు రాష్ట్రాల ఎంపీలు కృషి చేయాలని కోరారు.
Telangana employees: ఏపీ నుంచి రిలీవ్ చేయండి.. తెలంగాణ ఉద్యోగుల వినతి

Show comments