Site icon NTV Telugu

PM Modi: హైదరాబాద్‌లో జీఎంఆర్ ఎయిర్పార్క్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన మోడీ

Modi

Modi

హైదరాబాద్లో జీఎంఆర్ శాఫ్రాన్‌ ఎయిర్పార్క్ సెజ్ను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. శాఫ్రాన్‌ సంస్థకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. కొన్నేళ్లుగా ఏవియేషన్‌ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే భారత్‌ 1500 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్‌ ఇచ్చిందని తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల సర్వీస్‌ సెంటర్‌ భారత్‌లో ఏర్పాటు కావడం ఎంతో ఉపయోగకరమని చెప్పారు ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించే విధానంలో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. కొన్ని రంగాల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంగ్‌రెడ్డి మాట్లాడుూ… శాఫ్రాన్‌ సంస్థ హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇది నగర అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని చెప్పారు. ఏరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌ ఎదుగుతోందని పేర్కొన్నారు. ఏవియేషన్ రంగానికి చెందిన ఎన్నో సంస్థలు ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్నాయని, ఎంతో మంది నిపుణులు ఇక్కడ ఉన్నారని తెలిపారు. శాఫ్రాన్‌ సంస్థకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఇది కూడా చదవండి: KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్సీ రికార్డు అద్భుతం.. విజయ శాతం తెలిస్తే మైండ్ బ్లాకే!

ప్రధాని మోడీ చేపట్టిన ఆత్మనిర్భర్‌ భారత్‌ వల్లే ఇది సాధ్యమవుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు వివరించారు. హైదరాబాద్‌ నగరం ఏవియేషన్‌ హబ్‌గా ఎదుగుతోందని చెప్పారు.

 

Exit mobile version