NTV Telugu Site icon

Hyderabad Metro: నగరంలో భారీ వర్షం.. మెట్రోలో ప్రయాణికుల రద్దీ..

Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro: నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ మెట్రోకి ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. దీంతో మోట్రోలో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. దీంతో ప్రయాణికులు పక్కకు కదలలేని స్థితిలో ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. రద్దీ కారణంగా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మహిళా కొచ్ లో ఒకరితో ఒకరు మహిళా ప్రయాణికులు గొడవకు దిగుతున్నారు. రోజు వారీ ప్రయాణికుల కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణం చేయడంతో నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులతో కిక్కిరిపోయింది. టికెట్ కోసం క్యూ లైన్లలో బారులు తీరారు.

Read also: RTC Rakhi Record: ఆర్టీసీ రాఖీ రికార్డ్.. ఒక్క రోజే 64 లక్షల మంది ప్రయాణం..

సాధారణంగా హైదరాబాద్ మెట్రో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక ఇలా భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో.. రోడ్డుపై ప్రయాణించడం నరకాన్ని తలపిస్తుంది. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవడం కంటే మెట్రో రైలులో వెళ్లడమే మేలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది మంచి నిర్ణయమే కానీ మెట్రో రైళ్లు సరిపోని పరిస్థితి నెలకొంది. సాధారణంగా హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రతి 5 నిమిషాలకు వస్తాయి. రద్దీ పెరిగినప్పుడు, 2 రైళ్ల తర్వాత, 3వ రైలును 3 నిమిషాల్లో విడుదల చేస్తారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. సో..రాన్రానూ మెట్రో ప్రయాణం బాగా పెరిగింది. దీంతో రైళ్లు ముందుగానే వస్తున్నా సరిపోవడం లేదు. ఒక్కో రైలు వస్తే ప్లాట్‌ఫారమ్ దగ్గర 2 రైళ్లకు సరిపడా మంది ఉంటారు.

Read also: Historical Temple: ఆ ఆలయం రాత్రిపూట నగ్నంగా నిర్మాణం.. కానీ వారికి మాత్రం నో ఎంట్రీ..

చాలా సందర్భాల్లో హైదరాబాద్ మెట్రో.. ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఎక్కువసేపు రైళ్లను నడుపుతోంది. ఈరోజు ఉదయం భారీ వర్షం కురియడంతో మెట్రో రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. నేడు చాలా మంది రైళ్లను ఎంచుకుంటున్నారు. కొందరు బస్సుల్లో వెళ్తున్నారు. దీంతో రోడ్లపై రద్దీని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. మెట్రో టైమింగ్స్ పెంచాలని.. ప్రతి 3 నిమిషాలకు ఒక రైలు వచ్చేలా చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే సాంకేతిక కారణాలతో మెట్రో యాజమాన్యం ప్రతి 5 నిమిషాలకు ఒక రైలును పంపుతోంది. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన. 5 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. మెట్రో రైళ్ల సంఖ్యను పెంచితే ప్రయాణికులకు మేలు జరుగుతుంది.
School Holiday: విద్యాశాఖ అలర్ట్.. నేడు పాఠశాలలకు సెలవు