NTV Telugu Site icon

Musi River Area: చైతన్యపురి, సత్యనగర్ లో ఉద్రిక్తత.. మార్కింగ్ ప్రక్రియపై ఆందోళన..

Musi River

Musi River

Musi River Area: చైతన్యపురి సత్య నగర్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మూసీ రివర్ బెడ్ నిర్మాణాలు గుర్తించి రెవిన్యూ అధికారులు మార్కింగ్ చేపట్టారు. మార్కింగ్ చేస్తున్న అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో మార్కింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. తమ ఇళ్లపై మార్కింగ్ చేయొద్దని పెట్రోల్ పోసుకుని బాధితుల ఆత్మహత్య యత్నం చేపట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు బాధితునికి అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మూసి నివాసితుల ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. ఇళ్లకు మార్కింగ్ వేయకుండా మూసీ నివాసిత ప్రజలు అధికారులను వెనక్కి పంపిస్తున్నారు. దీంతో కొత్తపేట మారుతి నగర్ లో అధికారుల మూసీ సర్వే నిలిచిపోయింది. మూసి బాధితులకు LB నగర్ బీజేపీ కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. బాధితుల ఆందోళనలకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సంఘీభావం ప్రకటించారు. ఇక.. మూసి పరివాహిక ప్రాంత బాధితులకు వనస్థలిపురం డబుల్ బెడ్ రూం ఇండ్లకు తరలించారు. దీంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగడానికి నీరు లేక వాటర్ బాటిల్స్ కొనుక్కొని త్రాగే పరిస్థితి వచ్చిందన్నారు. నివాసానికి కనీస వసతులు ఏర్పాటు చేయకుండా.. దిల్ సుక్ నగర్ మూసి పరివాహాక ప్రాంతం నుండి చిన హైడ్రా,ముసిపల్ అధికారులు వనస్థలిపురంకు తరలించారని మండిపడ్డారు.
Hydra Demolitions: హైడ్రా దారితప్పుందా..?