NTV Telugu Site icon

CM Revanth Reddy: అమరులైన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుంది..

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: అమరులైన పోలీస్ అధికారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. తెలంగాణ అమరులైన పోలీసు అధికారులందరికీ ప్రభుత్వం తరఫున ఘన నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. 140 కోట్ల దేశ జనాభా ప్రశాంతంగా ఉంటున్నారు అంటే అందుకు పోలీసుల కారణం అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలంటే పోలీసులు కీలకం అని తెలిపారు. నిరుద్యోగుల సమస్య, శాంతి భద్రత లేని రాష్ట్రం ఉంటే పెట్టుబడులు రావన్నారు. రాష్ట్రం అభివృద్ధికి పోలిసుల నిరంతరం శ్రమిస్తున్నందుకు పోలీసులు అభినందనలు అన్నారు. అమరులైన పోలీస్ అధికారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. తీవ్రవాదులు మావోయిస్టు చేతులో మరణించిన అధికారులను స్పందించుకోవడం అందరికి స్ఫూర్తిదాయకమన్నారు. కొత్త కొత్త పందాలు నేరాలు జరుగుతున్నాయని, అన్ని రకాల నేరగాళ్ళను అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు.

Read also: KTR Tweet Viral: రైతు బంధు, జీఎస్టీ పై కేటీఆర్ ట్వీట్ వైరల్..

నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. చదువుకున్నవారు సైబర్ క్రైమ్ బాధితులుగా మారుతున్నారని తెలిపారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తున్నాయని అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ విషయంలో విపత్కర పరిస్థితి ఎదురుకుంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో డ్రగ్స్ విరివిగా రవాణా పెరిగిపోయిందని, యువకులను మత్తు వైపు నడిపిస్తున్నాయి ముఠాలు అన్నారు. డ్రగ్స్ అరికట్టేందుకు టీజీ న్యభ్ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాము.. డీజీ స్థాయి అధికారిని నియమించామన్నారు. ట్రాఫిక్ నియంత్రంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘించే వారిని చర్యలు తీసుకోవాలన్నారు. మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతామన్నారు. కొంతమంది హైదరాబాదులో శాంతి లేకుండా అలజడి సృష్టిస్తున్నారన్నారు. ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన సంఘటనలో నేరగాలను కఠినంగా శిక్షిస్తామన్నారు. కొంతమంది వ్యక్తులు కావాలనే సమాజంలో అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు సంయమనం పాటించాలి, ఎంతో భావాద్వేగంతో పోలీసులు పని చేస్తున్నారని అ్నారు. మతోన్మాద శక్తులను ఈ తరహా నేరగాలను శిక్షించాలని అధికారులను ఆదేశిస్తున్న అన్నారు. వివిధ మతాల పండుగలకు పోలీసులు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారని సీఎం తెలిపారు.
Telangana Ministers: నేడు దక్షిణ కొరియాలో తెలంగాణ మంత్రుల పర్యటన..