Ramchander Rao: రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలి..!
- రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలి..
- రాహుల్ గాంధీ తల్లితండ్రులది వేర్వేరు మతాలు.. ఆయనది ఏ కులం..
- బీజేపీలో ఉన్న రెడ్డి నేతలెవరూ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా లేరు: రామచందర్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramchander Rao: మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు కాదు, భాస్కర్ అవార్డు ఇవ్వాలి.. నోబెల్ ప్రైజ్ కాదు, గోబెల్స్ ప్రైజ్ ఇవ్వాలి అంటూ సెటైర్లు వేశారు. నరేంద్ర మోడీ సీఎం అయ్యే ముందు నుంచే బీసీ.. అప్పటి నుంచి ఎన్నో కులాలు బీసీల్లో కలిసిపోయినట్లు గుర్తు చేశారు. ఇక, రాహుల్ గాంధీ తల్లి తండ్రులు వేర్వేరు మతాలకు చెందినవారు, ఆయన కులం ఏంటి?” అని ప్రశ్నించారు. అయితే, పార్టీలో పోస్టుల కోసం ఒత్తిడి చేయొద్దు అన్నారు. మనం అందరం పార్టీ కార్యకర్తలమే, పదవులు వచ్చినవారు ఎక్కువ కాదు, రాని వారు తక్కువ కాదని వెల్లడించారు. వారం రోజుల్లో పార్టీ కొత్త కమిటీని ప్రకటిస్తుంది.. అందులో మొత్తం 20 మందిని నియమిస్తాం.. 33 శాతం మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని రామచందర్ రావు చెప్పుకొచ్చారు.
Read Also: Balakrishna: హరిహర దర్శకుడితో బాలయ్య నెక్ట్స్?
Also Read
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
ఇక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన సూచనల మేరకు పార్టీ నేతలు ఎక్కువ టూర్లు చేయాలని, కార్యకర్తల్ని కలవాలని రామచందర్ రావు పేర్కొన్నారు. పార్టీ అంతర్గత సమస్యలు కుటుంబ సమస్యల వంటివే, వాటిని బయటకు తీసుకురావద్దు అన్నారు. అలాగే, దత్తాత్రేయని వైస్ ప్రెసిడెంట్ చేయమన్నట్టే, మేము కూడా పొన్నం ప్రభాకర్‌ను లేదా మహేష్ గౌడ్‌ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. బీజేపీ బీసీ పక్షపాతి.. బీసీలను పార్టీకి దూరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయన్నారు.. మేము 42 శాతం రిజర్వేషన్‌కు సపోర్టు ఇస్తున్నాం.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. కేంద్రంపై నెట్టవద్దని, రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత ఉందని వెల్లడించారు. బీజేపీలో ఉన్న రెడ్డి నేతలెవరూ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా లేరని, పార్టీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా ఈ విషయాన్ని తెలియజేశారని రామచందర్ రావు చెప్పారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!