NTV Telugu Site icon

CM Revanth Reddy: తెలంగాణ రైతన్నలు నేడు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులు..

Revanth Cm

Revanth Cm

CM Revanth Reddy: తెలంగాణ రైతన్నలు నేడు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని రైతాంగం నేడు అతి పెద్ద పండుగ జరుపుకుంటోంది. ఇంతకాలం రుణ భారంతో బతుకుభారమైన తెలంగాణ రైతన్నలు నేడు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా వరంగల్ లో ప్రకటించిన రైతు డిక్లరేషను అనుగుణంగా, దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. ఇది అసాధ్యమని చాలా మంది వక్రభాష్యాలు చెప్పారు. కానీ మా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకూ ఏక కాలంలో రుణ మాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నాం. దీనిపై ప్రతిపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నేను చెప్పదలచుకున్నాను… పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది.

Read also: CM Revanth Reddy: దేశ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది..

సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే… వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వ వ్యవసాయ శాఖ తీసుకుంటుంది. తొలిదశలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణ మాఫీ సొమ్ము 6,098 కోట్ల రూపాయలను జూలై 18న నేరుగా రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. దీనివల్ల 11 లక్షల 50 వేల మంది రైతన్నలు రుణవిముక్తి పొందారు. రెండో దశలో 6,190 కోట్ల రూపాయలను జూలై 30న నేరుగా రైతుల ఖాతాలో జమ చేసింది. దీనివల్ల 6 లక్షల 40 వేల 823 మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు. కాగా, 2 లక్షల రూపాయల వరకు గల రుణాలను ఈ రోజు మాఫీ చేసుకోవడం ద్వారా ఒక అద్భుత ఘట్టాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజే… తెలంగాణ రైతుకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని ఘనంగా చెప్పుకునే రోజు ఈ రోజు. ఈ కార్యక్రమంతో మా జన్మ ధన్యమైందని భావిస్తున్నాం. ఎందుకంటే, దేశానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాత సుఖ సంతోషాలతో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అందుకే 31 వేల కోట్లు వెచ్చించి… రైతును రుణ విముక్తుడిని చేస్తున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం మాదని తెలిపారు.

Read also: CM Revanth Reddy: గోల్కొండ కోటపై రెప రెప లాడిన జాతీయ జెండా.. జాతిని ఉద్దేశించి సీఎం ప్రసంగం..

అర్హులైన రైతు లందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి 10 వేల రూపాయలు మాత్రమే చెల్లించారు. అది కూడా అనర్హులకు, సాగులో లేని భూమి యజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారు. దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరలేదు. మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధివిధానాలు రూపొందిస్తోంది. దీనికోసం ప్రభుత్వం మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించింది. ఈ ఉప సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రైతులు, రైతు సంఘాలు, రైతు కూలీలు, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వాటిని పరిగణనలోకి తీసుకుని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకం ప్రారంభించుకోబోతున్నాం. మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తారంగా జరుగుతోంది. కానీ, పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. దీనికి 33 రకాల వరిధాన్యాలను గుర్తించాం. రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ, కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం.

Read also: Medical Services: నిలిచిన వైద్యసేవలు.. అత్యవసర పరీక్షలు సైతం అందక గర్భిణీల అవస్థలు

రైతుల సౌకర్యార్థం మొన్నటి రబీ సీజన్ లో ధాన్యం సేకరణ కేంద్రాల సంఖ్యను 7,178 కి పెంచాం. రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో చెల్లింపులు చేస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాం. నకిలీ విత్తన అక్రమార్కులను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. రైతులకు పంటలబీమా పథకం వర్తింపచేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు పైసా ఖర్చు లేకుండా పంటలకు పూర్తి భద్రత కలుగుతుంది. రైతులకు ఆధునిక సాంకేతిక విధానాలు, పంటల దిగుబడికి సంబంధించి శాస్త్రీయ పద్ధతులు తెలియజేయడానికి “రైతు నేస్తం” కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ సాగుకి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. రైతుల పాలిటశాపంగా మారిన ధరణి సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ధరణి అమలులో అవకతవకలు, లోపభూయిష్ట విధానాల కారణంగా రైతులకు ఎంతో కష్టం కలిగింది. ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాం. ‘ధరణి సమస్యల పరిష్కారానికి 2024 మార్చి 1 నుంచి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. ధరణిలో సమస్యలపరిష్కారం చేయలేనివి ఉంటే సదరు దరఖాస్తులను తిరస్కరిస్తే దానికి గల కారణాలను తప్పకుండా నమోదు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని ఆదేశించాం. భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టం తీసుకు రావాలని భావిస్తున్నాం.
DSC Recruitment Process: సెప్టెంబర్‌ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ..?