Site icon NTV Telugu

Muralidhar Rao: అక్రమాస్తుల కేసులో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్‌రావు అరెస్ట్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

Exencarrest

Exencarrest

మాజీ ఈఎన్సీ మురళీధర్‌రావును అక్రమాస్తుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.200 కోట్ల రూపాయల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: Fauja Singh: కారు ఢీకొని ప్రముఖ అథ్లెట్‌ ఫౌజా సింగ్‌ మృతి.. నిందితుడు ఎన్నారై అరెస్ట్

మంగళవారం బంజారాహిల్స్‌లోని మురళీధర్‌రావు ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న చర, స్థిరాస్తుల్ని గుర్తించారు. మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. జహీరాబాద్‌లో 2 కెవీ విద్యుత్ ప్రాజెక్టు వందల కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి మురళీధర్ రావు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. బినామీ పేర్లతో పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు కనుగొన్నారు. ఇక హైదరాబాద్, కరీంనగర్‌లో భారీ అపార్ట్‌మెంట్లు నిర్మించారు.

ఇది కూడా చదవండి: Mark Rutte: రష్యాతో స్నేహం చేస్తే దెబ్బతింటారు.. భారత్, చైనాకు నాటో చీఫ్ వార్నింగ్

Exit mobile version