NTV Telugu Site icon

Insta Reels Viral: ఏకంగా లాకప్‌ లో ఉన్న ఫ్రెండ్ తో రీల్స్‌.. పోలీసులు అంటే లెక్కలేదా?

Bandlagua Police

Bandlagua Police

Insta Reels Viral: హైదరాబాద్ పాతబస్తీ లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. లాకప్ లో ఉన్న స్నేహితుడిని కలవడానికి వచ్చిన ఓ యువకుడు అతనితో కలిసి రీల్ చేశాడు. అంతేకాకుండా ఆ రీల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది చూసిన స్థానికులు ముక్కున వేలువేసుకున్నారు. యువతకు పోలీసులు అంటే లెక్క లేకుండా పోతుందని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్న పోలీసులు ఎలా ఊరికే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ లో రీల్స్ చేస్తున్నా పోలీసులు పట్టించుకోక పోవడం ఏంటని మండిపడుతున్నారు. ఇలా చేయడం వలన నిజమైన పోలీసులపై కూడా ప్రజలకు నమ్మకం పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read also: Ekadasi 2024: ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. తొలి ఏకాదశి సందర్భంగా సందడి..

ప్రేమ పేరుతో తన కూతురుని ఎత్తుకెళ్లాడని ఓ తల్లి బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా స్థానిక యువకుడు మూదషీర్ పై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూదషీర్ ను పట్టుకున్నారు. అతనికి పోలీస్టేషన్ తీసుకువచ్చి దర్యాప్తు చేసిన అమ్మాయి జాడ కనిపెట్టలేకపోయారు. దీంతో మూదషీర్ ని పోలీస్టేషన్ లోనే ఉంచారు. పోలీస్ స్టేషన్ సెల్ లో ఉన్న స్నేహితుడిని కలవడానికి ముబారక్ వచ్చాడు. మూదషీర్ తో ముబారక్ కలిసి ఇద్దరు వీడియో రీల్ చేశారు. ఇక లాకప్‌లో ఉన్నాకూడా బాలిక కుటుంంబాన్ని బెదిరిస్తూ మూదషీర్ రీల్ చేశాడు. పోలీస్‌స్టేషన్‌లోనే ఫ్రెండ్స్‌తో రీల్స్‌ చేయిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడు . ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలోనే నిందితుడు మూదషీర్ కి పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అందుకు నిదర్శనమే పోలీస్‌స్టేషన్‌లో చేసిన రీల్సే రుజువు అంటున్నారు. పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల ముందే రీల్స్‌ చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తోంది బాలిక ఫ్యామిలీ. దీంతో సోషల్‌ మీడియా ద్వారా పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు పాతబస్తీ వాసులు. ఇదీ అచ్చితంగా ఎపుడైందో తెలియదు గానీ… ఈ వీడియో చూసిన ప్రజలు ముక్కున వెళుసుకుంటున్నారు

Gold Rate Today: నేడు తులంపై రూ.980 పెరిగింది.. 75 వేల మార్క్‌ను తాకిన బంగారం ధర!

Show comments