Raghunandan Rao: హరీశ్ రావు బడ్జెట్‌కి, భట్టి బడ్జెట్‌కి తేడా ఏముంది? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర బడ్జెట్ పై ఫైర్ అయ్యారు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి అంటున్నారు. అక్కడ చదువుకున్నవారికి పేదలకు టాయిలెట్లు కట్టించాలన్న ధ్యాస లేకపోయిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తోలు గుడ్డు పెట్టిన కేటీఆర్, గాడిద గుడ్డు అంటున్నారన్నారు. గుండు సున్నాలు పెట్టినోళ్లు, గాడిద గుడ్లు పెట్టినోళ్లు ఈరోజు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 33 జిల్లాల పేర్లను బడ్జెట్‌లో చదవని మీరు, కొడంగల్‌కు కుడా పెట్టినట్టు మిగతా పట్టణాలకు పెట్టని మీరు మాట్లాడే హక్కు లేదన్నారు. మీరంతా నై తెలంగాణ బ్యాచ్. మేమంతా జై తెలంగాణ బ్యాచ్ అన్నారు. ఒక్క వేలు మావైపు చూపిస్తే.. నాలుగు వేళ్లు మీ వైపు చూపిస్తున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారని తెలిపారు. మూసీ ప్రాజెక్టును ఏటీఎం చేసుకోవాలని అనుకుంటున్నావా? ఫసల్ బీమా యోజనలో చేరతామని భట్టి చెప్పారు. ఈ పథకం కేంద్ర ప్రభుత్వానిది కాదా? అని ప్రశ్నించారు. కౌలు రైతులకు కూడా నిధులిస్తామన్నారు. ఒక్క రూపాయి ఇచ్చారా? అని ప్రశ్నించారు. మహిళలకు మీరు ఇస్తామన్నది ఏమైందని ప్రవ్నించారు.
Read also: CM Revanth Reddy: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు..
ఏడాదికి కనీసం రూ. 30 వేల కోట్లు కేటాయించాలి. మరి బడ్జెట్‌లో ఎక్కడా కనిపించదే? తెలంగాణ బడ్జెట్‌లో ఒక్క జిల్లా పేరైనా వచ్చిందా రేవంత్ రెడ్డి? అన్నారు. వికారాబాద్ జిల్లాకు ప్రత్యేక గ్రాంట్ ఏమైనా ఇచ్చారా?కేసీఆర్ సీఎంగా ఉంటే గజ్వేల్ కి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వస్తుంది అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అవగానే కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఏర్పడింది. వికారాబాద్ వుడా కాలేదు. రంగారెడ్డి రుడా కాలేదన్నారు. కొడంగల్ కి డిగ్రీ కాలేజి, నర్సింగ్ కాలేజీలు తీసుకెళ్లావన్నారు. మరి రాష్ట్రంలో 118 నియోజకవర్గాలు మీకు కనిపించలేదా? మా దుబ్బాకు ఒక మెడికల్ కాలేజి ఇచ్చావా? ఆదిలాబాద్ కో, బోధ్‌కో మెడికల్ కాలేజీ ఇచ్చావా? కొడంగల్‌కు రూ. 5 వేలు కోట్లు ఇచ్చుకున్న నీకు భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు. అభయహస్తం అన్నారు. అది భస్మాసుర హస్తమైందన్నారు. బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తా అన్నాడు. ఒక్కటైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. అధికారంకోసం అడ్డమైన హామీలిచ్చి, అడ్డదారులు తొక్కి అడ్డమైన గడ్డి తిని, ఇప్పుడు చేస్తున్నదేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకో పరీక్ష అన్నారు. పరీక్షలు వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. ఆపన్న హస్తం కర్కశ హస్తంగా, కపట హస్తంగా మారిందన్నారు
Komatireddy Venkat Reddy: హాట్ కామెంట్.. కేసీఆర్ స్థానంలో నేనుంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పేవాడిని..