NTV Telugu Site icon

President Droupadi Murmu: నేడు శిల్పారామంలో లోక్‌ మంథన్‌ ను ప్రారంభించనున్న రాష్ట్రప్రతి

President Droupadi Murmu

President Droupadi Murmu

President Droupadi Murmu: లోక్ మంథన్ మహోత్సవానికి భాగ్యనగరం వేదికయ్యింది. నేడు లోక్‌ మంథన్‌ ను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 9.30కి శిల్పకళా వేదికలో లోక్‌మంథన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరివెళతారు. లోక్‌మంథన్ ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షునిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. నిన్న లోక్‌ మంథన్‌ కార్యక్రమంలో భాగంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి జూపల్లి కృష్ణారావు శిల్పారామంలో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

Read also: Maoist Attack: వాజేడులో దారుణం.. ఇద్దరిని గొడ్డలితో నరికి చంపిన మావోలు..

2016లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో లోక్‌మంథన్ నిర్వహించారు. ఒక్కో రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. ఇది నాల్గవ లోకమంతన్. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. దేశంలోని జానపద కళాకారులందరినీ ఒక చోట చేర్చి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రజ్ఞా ప్రవాహ అనే సంస్థ ఒక వేదికను ఏర్పాటు చేసింది. దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ప్రతినిధులు, విదేశీ కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. లోక్‌ మంథన్ వేడుకలో గిరిజన హస్తకళల, కళా ప్రదర్శనలు ఉంటాయి. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ లో వివిధ ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు, ప్రజలు తమ నైపుణ్యాలను ప్రదర్శించే కార్యక్రమం కూడా ఉంటుంది. వందకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, 1500 మందికి పైగా కళాకారులు సంప్రదాయ సంగీత వాయిద్యాలు, ఉపకరణాలను ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు.

Read also: Tollywood Movies : క్రిస్మస్ జాతర.. ముగ్గురిలో విజేత ఎవరవుతారు ?

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఇవాళ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఈ జంక్షన్లలో ట్రాఫిక్ నిలిపివేయనున్నారు. రాజ్ భవన్ కుడివైపు వీవీ విగ్రహం, కేసీపీ అన్సారీ మంజిల్- తాజ్‌కృష్ణ, ఎన్ఎఫ్సీఈఎల్ ఎస్ఎల్టీ, సాగర్ సొసైటీ, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెం-45 జంక్షన్, కేబుల్ బ్రిడ్జ్, రోడ్ నెం-65, జూబ్లీ హిల్స్, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్ఎన్టీ- ఎన్ఎఫ్సీఎస్, పంజాగుట్ట వంతెన, ప్రజా భవన్, బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు వెల్లడిచారు.
VishwakSen : మెకానిక్ రాకీ ఓవర్సీస్ టాక్.. ఎలా ఉందంటే..?

Show comments