Chikoti Praveen: నేడు ED ముందుకు ప్రవీణ్ చికోటి, మాధవ రెడ్డి.. సీనీ ఇండస్ట్రీ, రాజకీయ నేతల్లో గుబులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ పేరు హాట్ టాపిక్ అయ్యింది.. ఎక్కడ చూసిన అతడి న్యూసే.. అయితే నేడు ప్రవీణ్ కు ఈడీ ముందు విచారణకు ప్రవీణ్ చికోటి, మాధవ రెడ్డి హాజరు కానున్నారు. రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలను బయటపెట్టే అవకాశం ఉంది. దీంతో సినీ ఇండస్ర్టీ, రాజకీయ నేతల్లో గుబులు నెలకొంది. ఎవరి పేరు బయటకు వస్తుందో అంటూ భయంతో వణుకుతున్నారు. ఈనేపథ్యంలో.. రాజకీయ నేతలు కూడా ఆ పేరు ప్రస్తావిస్తూ.. విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ సోదాలు నిర్వహించడంతో చికోటి.. చీకటి సామ్రాజ్యం లింక్‌లు కదులుతున్నాయి.. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా.. హీరోయిన్లు, సినీ ప్రముఖులతో సంబంధాలు కలిగిఉన్న ఆయన.. వారికి భారీగా రెమ్యునరేషన్లు ఇచ్చారనే విషయం వెలుగు చూసింది.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు.. ఇలా.. చాలా మంది చికోటితో చీకటి బాగోతం నడిపారనేఏ ఆరోపణలు వస్తున్నాయి.
read also: AICC: ఆగస్టు 5న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు.. ప్రధాని నివాసం ముట్టడికి పిలుపు!
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
చికోటీ ప్రవీణ్ ఇదొక పేరు మాత్రమే కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ అని టాక్ నడుస్తోంది. ఈడీ రంగంలోకి దిగడంతో చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏడు నెలల్లో ఏడు దేశాల్లో చికోటి ప్రవీణ్ క్యాసినో నిర్వహించినట్లుగా గుర్తించారు అధికారులు. చికోటి ప్రవీణ్‌తో పాటు ఈ చీకటి వ్యాపారంలో మాధవరెడ్డి పాత్ర చాలా కీలకమైనదని అధికారులు గుర్తించారు.. పాలు, పెరుగు అమ్ముకునే స్థాయి నుంచి క్రమంగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడి లక్షల రూపాయలు అప్పుల్లో కూరుకుపోయి.. చికోటి ప్రవీణ్‌తో పరిచయంతో క్యాసినో సామ్రాజ్య విస్తరణకు దారితీసిందట. మొత్తంగా చికోటి ప్రవీణ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఇదిలా ఉండగా.. సైదాబాద్‌లో ప్రవీణ్ చికోటి ఇంటి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు పహారా కాస్తున్నట్లు చికోటి ప్రవీణ్ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఉదయం నుండి ఇంటి సమీపంలో దుండగులు తిష్ట వేసినట్లు భయాందోళనకు గురవుతున్నారు. బిల్డింగ్ చుట్టూ చికోటి ప్రవీణ్ సెక్యూరిటీ అప్రమత్తం అయ్యారు. సీసీటీవీ కెమెరాల ద్వారా ఆ వ్యక్తులను కుటుంబ సభ్యులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో చికోటి ప్రవీణ్‌కు ప్రాణహాని ఉందంటూ ఆయన కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. అయితే.. చికోడి ప్రవీణ్ తో రాజకీయ, సినీ ఇండస్ట్రీతో సత్ సంబంధాలు వున్నట్లు చెబుతున్న అధికారులు, ప్రవీణ్ విచారణలో ఎవరి పేర్లు బయట పెట్టనున్నాడో.. వేచి చూడాల్సిందే..
తాజావార్తలు
-
Vaibhav-MS Dhoni: ఎంఎస్ ధోనీ కాదు బిహార్‌కు గుర్తింపు వైభవ్ వల్లే.. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
-
Aadhaar Mobile Number Update: ఆధార్‌లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!