NTV Telugu Site icon

Pravasi Prajavani: గల్ఫ్‌ బాధితుల కోసం ప్రవాసి ప్రజావాణి కౌంటర్‌.. వారిని రెండు రోజులు

Ponnam Prabhakar

Ponnam Prabhakar

Pravasi Prajavani: ప్రజా భవన్ లో వారానికి రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాల్టి నుంచి గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసి ప్రజావాణి పేరుతో కౌంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమం ప్రజావాణి కార్యక్రమం మాదిరిగానే వారినికి రెండు రోజులు అంటే (బుధ, శుక్ర) వారాల్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం 10.00 గంటలకు మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి ప్రారంభించనున్నారు. ముఖ్యంగా గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సమస్యల పరిష్కారానికి దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో కౌంటర్‌ తెరిచి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి పాల్గొంటారు. ప్రధానంగా గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రవాసీ ప్రజావాణి కౌంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ వినోద్ కుమార్ తెలిపారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రజాభవన్‌లో ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజాభవన్ లో ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో గల్ఫ్ లో వున్న తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం ఈకార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. మరి దీనిపై పొన్న ప్రభాకర్ బాధితుల సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలపై అధికారులతో చర్చించనున్నారు.
Yamaha : కేవలం రూ. 2,999కట్టి ఈ కంపెనీ టూవీలర్స్‌ ఇంటికి పట్టుకెళ్లండి!