Ponnam Prabhakar: ఆగస్టు 2 కూడా వస్తుంది పోతుందని కేటీఆర్ కు రవాణా, బీసీ సంక్షేమం శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఇంకా యువరాజు అనుకుంటున్నారని వ్యంగాస్త్రం వేశారు. ప్రభుత్వానికి ఆయన అల్టిమేటం ఇచ్చేది ఏం లేదన్నారు. ఆగస్టు 2 కూడా వస్తుంది..పోతుందన్నారు. కాళేశ్వరం లో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసన్నారు. కేంద్రం నుండి నిధులు తెప్పించు కిషన్ రెడ్డి అని ప్రశ్నించారు. హైదరాబాద్ కి ఒక్క పైసా ఇప్పించలేదు మీరు అని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం 10 వేల కోట్లు పెట్టిందన్నారు.
Read also: Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆటగాళ్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
పైసా ఇవ్వకుండా తిరిగి ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం మూర్ఖత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ మోడీకి అన్ని బిల్లులకు సపోర్ట్ చేసి నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లలేదన్నారు. మేము కేంద్ర బడ్జెట్ పై తెలంగాణకు జరిగిన అన్యాయంపై నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లకుండా నిరసన తెలుపుతున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఎల్లంపల్లి పూర్తి అయిందన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టకపోవడం వలన మనకు నష్టం జరిగిందని తెలిపారు. విహార యాత్రలకు వెళ్లినట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లారని మండిపడ్డారు. రైతాంగాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. హుకుం జారీ చేయడానికి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేదని గుర్తు చేశారు.
Read also: Harish Vs Revanth: పెద్దాయనకు ఫుల్ నాలెడ్జ్.. రేవంత్ రెడ్డి కౌంటర్..
ఆగస్టు 2 వరకు టైం ఇచ్చిన కేటీఆర్..
ఆగస్టు 2వ తేదీలోపు కన్నెపల్లి పంప్‌హౌజ్‌లు ప్రారంభించకపోతే.. 50 వేల మంది రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తాం అని తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ గుండె లాంటిందని, రాష్ట్రంలో కరువు అనే మాట వినపడకుండా ముందు చూపుతో కేసీఆర్ కాళేశ్వరం నిర్మించారన్నారు. కాళేశ్వరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, చిన్న సమస్య తలెత్తితే ప్రాజెక్ట్‌పై విష ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కన్నెపల్లి పంప్‌హౌజ్ వద్ద పరిస్థితులను పర్యవేక్షించారు. స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనంత గొప్పగా ముందు చూపుతో కాళేశ్వరంను కేసీఆర్ నిర్మించారు. బహుళార్థ ప్రయోజనాల లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. అత్యంత ఎత్తైన 618 అడుగుల కొండపోచమ్మ సాగర్ వరకు నీరు వెళ్లే విధంగా డిజైన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు కామధేనువు లాంటిది. ఎగువ గోదావరి నుంచి దిగువన ఉన్న కాళేశ్వరం వరకు పరిశీలించామన్నారు.
Telangana Assembly 2024 LIVE UPDATES: తెలంగాణ అసెంబ్లీ 2024.. లైవ్ అప్‌డేట్స్
