Site icon NTV Telugu

Mahesh Kumar Goud: ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా? కేటీఆర్ కు పీసీసీ చీఫ్ సవాల్..

Congress Vs Brs

Congress Vs Brs

Mahesh Kumar Goud: గ్రూప్-1 మెయిన్స్ ను వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళనతో తెలంగాణ రాష్ట్ర వాతావరణం హీటెక్కింది. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య గ్రూప్-1 దుమారం రేపుతుంది. అటు గాంధీభవన్, ఇటు తెలంగాణ భవన్లో నేతలతో అభ్యర్థుల సమావేశమయ్యారు. తెలంగాణ భవన్ లో గ్రూప్-1 అభ్యర్థులు కేటీఆర్ ను కలిసి.. గ్రూప్-1 మెయిన్స్ ను వాయిదా వేసేలా ప్రభుత్వంపై ఓత్తిడి తేవాలని కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్ తప్పకుండా సహకరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు గాంధీ భవన్ లో గ్రూప్-1 అభ్యర్థులతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. గ్రూప్స్ 1 అభ్యర్థుల డిమాండ్లను తెలుసుకున్నారు. జీవో 29 రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. పాత జీవో 55 ప్రకారం పరీక్షల నిర్వహణ జరగాలన్నారు. పాత నోటిఫికేషన్ లో ఇచ్చిన 503 పోస్ట్ లలో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వవద్దన్నారు.

Read also: KTR: అండగా ఉంటాం.. గ్రూప్-1 అభ్యర్థులకు కేటీఆర్ హామీ..

పెంచిన 60 పోస్ట్ ల్లో మాత్రమే కొత్తగా అప్లై చేసుకున్న వారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. (ప్రభుత్వం కొత్తగా 503 పోస్ట్ ల్లో60 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇచ్చింది) జీవో 29 , రిజర్వేషన్ల అంశాల్లో కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయి.. వాటిని పరిష్కరించి పరీక్షలు పెట్టాలని కోరారు. పాత నోటిఫికేషన్ ప్రకారమే రిజర్వేషన్లు, ఓపెన్ క్యాటగిరి ప్రకారం పరీక్షలు ఉండాలని అన్నారు. గ్రూప్స్ 1 అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రభుత్వానికి సమాచారం అందిస్తామని మహేష్ గౌడ్ తెలిపారు. సాయంత్రం వరకు మీకు సమాచారం ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు కేటీఆర్ పై పీసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా..? అంటూ కేటీఆర్ కు పీసీసీ చీఫ్ సవాల్ విసిరారు. నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు కేటీఆర్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో నే.. డీఎస్సీ.. వైద్యారోగ్యశాఖ లో ఉద్యోగాలు. గ్రూప్స్.. పోలీసు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మీరు ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసి మిగులు రాష్ట్రాన్ని.. అప్పుల రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు.
Skin Care Tips: మెడ చుట్టూ నలుపు పోవాలంటే ఇలా చేయండి..

Exit mobile version