NTV Telugu Site icon

Patnam Narender Reddy Wife: పోలీసులపై చర్యలు తీసుకోండి.. హైకోర్టులో పట్నం శృతి పిటిషన్..

Patnam Mahender Reddy Wife Sruti

Patnam Mahender Reddy Wife Sruti

Patnam Narender Reddys Wife: తెలంగాణలో లగచర్ల ఘటన సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ లగచర్ల ఘటనలో పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ నమోదు అయ్యింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా తన భర్త పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారని సతీమణి పట్నం శృతి పిటిషన్ ధాఖలు చేశారు. దీనిపై పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పట్నం శృతి పిటిషన్ పేర్కొన్నారు. ఒక వ్యక్తిని అరెస్టుచేసే సమయంలో అనుసరించాల్సిన నిబంధనలు పాట్టించలేదని పేర్కొన్నారు. డి.కె. బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శృతి పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా ఐజీ వి. సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ కె. నారాయణరెడ్డి, బొమ్మరాస్పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి, ఎస్సై మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ చేర్చారు. పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ పట్నం శృతి కోరారు. మరి దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

Read also: BRS Maha Dharna: మహబూబాబాద్‌ లో 144 సెక్షన్‌.. భయాందోళనలో మానుకోట ప్రజలు..

తాజాగా లగచర్ల ఘటనపై పట్నం మహేందర్‌ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే. లగచర్లలో భూసేకరణకు సంబంధించిన విచారణకు వెళ్లిన కలెక్టర్‌, ఇతర అధికారులపై దాడికి పాల్పడిన ఘటనలో ఎ1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి కీలక పోషించారని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు. ఏ-2గా ఉన్న సురేశ్‌ ఇతర నిందితులను నైతికంగా సహకరించార ఆరోపణలు వున్నాయి. అయితే సురేష్ తో దాదాపు 89 సార్లు ఫోన్‌ కాల్స్‌ మాట్లాడారని తెలిపారు. ఈ ఘటన తరువాత నుండి సురేష్ పరారీలో ఉండగా, పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలించారు. తాజాగా సురేష్ స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోవడం గమనార్హం. సురేష్ లొంగిపోవడంతో లగచర్ల ఘటనపై తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. పోలీసులు ఆరోపించినట్లుగా సురేష్ ఎవరి పేర్లు బయటపెడతాడు అన్న ఉత్కంఠ నెలకొంది.
Winter Season: చలికాలంలో పాదాలు పగులుతున్నాయా.. ఇలా చేయండి..