NTV Telugu Site icon

Patnam Mahender Reddy: నా ఫామ్ హౌజ్ పక్కనే సబితా, పొంగులేటి ఫామ్ హౌజ్ లు ఉన్నాయి..

Patnam Mahender Reddy

Patnam Mahender Reddy

Patnam Mahender Reddy: సబితా ఇంద్రారెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇద్దరికి నా ఫామ్ హౌజ్ పక్కనే ఫామ్ హౌజ్ లు ఉన్నాయని తెలంగాణ శాసనమండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీష్, సబితా ఇంద్రారెడ్డికి చెప్పేది ఒకటే.. నా ఫామ్ హౌజ్ రూల్స్ ప్రకారం ఉందన్నారు. రూల్ ప్రకారం లేదంటే నేనే దగ్గర ఉండి కూల్చివేస్తా అన్నారు. ప్రతీ సారి నా పేరు తీసుకుని విమర్శలు చేస్తున్నారు. నేను మంత్రిగా పని చేసిన.. భాద్యత ఉన్న వ్యక్తిని అని గుర్తు చేశారు. నిబంధనల మేరకే ఫామ్ హౌజ్ ఉందని అధికారులు నాకు నివేదిక ఇచ్చారన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నా ఫామ్ హౌజ్ నిర్మాణం చేయలేదన్నారు. రింగ్ రోడ్డు మీద నుంచి చూస్తే గుట్టల మీద ఉంటది. నీళ్ళు ఉన్నట్లు కనిపిస్తోందని క్లారిటీ ఇచ్చారు. నా ఫామ్ హౌజ్ 20 ఏళ్ల క్రితం కట్టామన్నారు.

Read also: Eating Biscuits: బిస్కెట్స్ ఎక్కువగా తింటున్నారా? హెచ్చరిక!

111 జీవో సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నారు. అధికారుల నుంచి నాకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజ్ కు పర్మిషన్ ఉందా? లేదా ? నాకు తెలియదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫామ్ ఉంటే కూల్చి వేయాల్సిందే అన్నారు. సబితా ఇంద్రారెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇద్దరికి నా ఫామ్ హౌజ్ పక్కనే ఫామ్ హౌజ్ లు ఉన్నాయని తెలిపారు. నిన్న తెలంగాణ శాసనమండలి చీఫ్‌ విప్‌గా పట్నం మహేందర్‌‌రెడ్డి‌ నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్నం మహేందర్‌రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాగా తాను చీఫ్ విప్‌గా నియమించిన సందర్భంగా రేవంత్‌రెడ్డిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశానని పట్నం స్పష్టంచేశారు. అంతేకాకుండా.. బొకే అందించి, శాలువాతో సన్మానించి, ఆయనకు ధన్యవాదాలు తెలియజేశానని ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు.
Medak Crime: దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు..

Show comments