MLA Sudheer Reddy: బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్మూలాట కొనసాగుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ వివాదంపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ.. మా పార్టీలో ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని తేల్చి చెప్పారు. మేమంతా కలిసికట్టుగా పార్టీ కోసం పని చేస్తున్నాం అన్నారు. మా అందరికీ రథ సారధి కేసీఆర్.. ఆయన ఆదేశాలతో అందరం పని చేస్తున్నామని పేర్కొన్నారు. కావాలనే ప్రతిపక్షాలు మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయి.. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తారనే భయంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.. గతంలో కూడా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ అనేక సార్లు వెళ్ళాడు.. ఉండాల్సిన విభేదాలు అన్ని వారి పార్టీలోనే ఉన్నాయి.. రాష్ట్ర అధ్యక్షుని విషయంలో విభేదాలతోనే ఏడాది నుంచి పెండింగ్ లో ఉందని సుధీర్ రెడ్డి తెలిపారు.
Read Also: JC Diwakar Reddy: తాడిపత్రి పోలీసులకు జేసీ వార్నింగ్.. బుధవారం వరకు టైం ఇస్తున్నా..!
అయితే, హైదరాబాద్ నగరం మీద ముఖ్యమంత్రి పగ బట్టాడు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలో ప్రజల్ని భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడు.. మెట్రో ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారు.. మెట్రో ఛార్జీల పెంపుపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ తిరోగమన దశలో ఉంది.. ప్రజా రవాణా కోసం చాలా చోట్ల ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తాయి.. అలాగే, రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది.. రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి.. హైడ్రా ఉద్దేశ్యం మంచిదైన ఆచరణలో మాత్రం విఫలం అయింది అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
