Site icon NTV Telugu

New Traffic Rules: త్వరలో హైదరాబాద్లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ నియంత్రణ!

Anand

Anand

New Traffic Rules: హైదరాబాద్ నగరంలో త్వరలో కొత్త ట్రాఫిక్ రూల్స్ రాబోతున్నాయి.. దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఒక వైపు వాహనాల వేగం పెరిగింది.. 24 నుంచి 26 కిలోమీటర్లు వాహనాలు హైదరాబాద్ రోడ్ల మీద పరుగులు పెడుతున్నాయని తెలిపారు. వాహనాల యావరేజ్ స్పీడ్ బాగా పెరిగింది, రోడ్లు మాత్రం అంతే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, హైదరాబాద్ లో 95 లక్షలు వాహనాలు ఉన్నాయి.. వంద టౌన్ వెడ్డింగ్ ఏర్పాటు చేశాం.. తోపుడు బండ్లు, ఫుట్ పాత్ ల మీద కబ్జాలు తీసివేయడంతో వాహనాల స్పీడ్ పెరిగింది అని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.

Read Also: Shekar Kammula : భారీ బడ్జెట్ కాదు.. ప్రేక్షకులు మెచ్చినవే పాన్ ఇండియా మూవీలు..

ఇక, హైదరాబాద్ నగరంలో ఆపరేషన్ రోప్ ను ఇంకా ముందుకు తీసుకుని పోతామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అలాగే, సీఎం రేవంత్ రెడ్డి తన కోసం ట్రాఫిక్ ను ఎక్కువ అపవద్దని చెప్పారు.. ఎదురు రూట్ లో ట్రాఫిక్ ను వదిలి పెట్టాలని ముఖ్యమంత్రి చెప్పారని పేర్కొన్నారు.. ఇక, 85 శాతం సిగ్నల్స్ ఆటో మోడ్ లో పని చేస్తుంది.. ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య పైనా కాకుండా క్వాలిటీ పైనా దృష్టి పెట్టాలని చెప్పాం.. అలాగే, డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం.. ఎక్కడైతే ట్రాఫిక్ కు ఇబ్బంది ఉంటదో.. అక్కడ డ్రోన్లను ఉపయోగిస్తామని తేల్చి చెప్పారు.

Exit mobile version