Telangana Auto Drivers: రాష్ట్రంలో కాలుష్యం పెరిగిపోతోందని పర్యావరణ శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో భవిష్యత్ తరాల మనుగడకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డీజిల్, పెట్రోల్ ఆటోల నియంత్రణపై దృష్టి సారించింది. ఎలక్ట్రిక్ ఆటోలు జోరో పొల్యూషన్ ఉంటుందని కావున ప్రభుత్వం వాటిని ప్రోత్సహించాలన్నారు. దీంతో డీజిల్, పెట్రోల్ ఆటోలను కొత్తగా కొనుగోలు చేసేవారికి నో పర్మిట్ నిబంధనను అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 733 ఆటోలు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో 1.5 లక్షల ఆటోలు నమోదయ్యాయి. దీంతో మరింత పెరుగుతుందని భావించిన ప్రభుత్వం కాలుష్య నివారణకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కొత్త కొనుగోలుదారులకు ‘నో పర్మిట్’ నిబంధనను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read also: Revanth Reddy: సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి.. గ్రామస్తులతో కలిసి దసరా వేడుకలు
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీలో కూడా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. జిల్లాలో ఇప్పటికే 25 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు. డీజిల్‌తో నడిచే బస్సుల గడువు సమీపిస్తున్నందున వాటి స్థానంలో బ్యాటరీతో నడిచే బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజా రవాణాలో ఆటోల వినియోగం ఎక్కువగా ఉన్నందున వాటి స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహిస్తామని, కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో కాలుష్యాన్ని తగ్గించవచ్చని పర్యావరణవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Heavy Rains: తుఫాన్‌పై వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీతోపాటు తెలంగాణకు భారీ వర్షాలు