NTV Telugu Site icon

Ponguleti Srinivasa Reddy: తెలంగాణలో ధరణి పోర్టల్ రద్దు.. త్వరలో కొత్త చట్టం

Darani

Darani

Ponguleti Srinivasa Reddy: ధరణి పొర్టల్ ను రద్దు చేసి త్వరలో ROR చట్టం తీసుకు వస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ నెలాఖరులోగా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించాం.. ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటాం.. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్స్ ను గాలికి వదిలేసింది.. పూర్తైన ఇండ్లను దసరా లోపు పేద ప్రజలకు అందజేస్తామని ఆయన వెల్లడించారు. ఇక, వెంటనే మరమ్మత్తులు మౌలిక వసతులు కల్పిస్తాం.. ప్రతి నియోజకవర్గానికి 3500 నుంచి 4 వేల ఇండ్లు మంజూరు.. ప్రతిపక్షాల సలహాలు, సూచనలు స్వీకరిస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Read Also: Glowing Skin: మెరిసే చర్మం కోసం ఉదయాన్నే ఇలా చేయండి..!

అలాగే, రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్‌ కింద సుమారు 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. పురపాలక సంఘాల పరిధిలో 10.54 లక్షలు, గ్రామ పంచాయతీల పరిధిలో 10.76 లక్షలు వచ్చాయి.. మిగిలినవి కార్పొరేషన్ల పరిధిలో ఉన్నాయి.. వాటి పరిశీలన, ఆమోదం, ఫీజు వసూలుకు వివిధ దశలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూములను రక్షిస్తూ అర్హత ఉన్న లేఅవుట్లను క్రమబద్ధీకరించే బాధ్యతలను ఆయా జిల్లా కలెక్టర్లకు తెలంగాణ సర్కార్ అప్పగించింది. అయితే, పురపాలక, రెవెన్యూ శాఖలే కాకుండా అవసరమైతే ఇతర శాఖలకు చెందిన సిబ్బందిని కూడా నియమించుకుని దరఖాస్తుల పరిశీలన వేగంగా కంప్లీట్ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.