Site icon NTV Telugu

MP Vijaysai Reddy: ముగిసిన విజయసాయిరెడ్డి విచారణ.. 25 ప్రశ్నలు సంధించిన ఈడీ..

Mp Vijaysai Reddy

Mp Vijaysai Reddy

MP Vijaysai Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. ఈడీ విచారణ ముగిసింది.. కాకినాడ సీ పోర్టు, సెజ్ కేసులో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో సాయిరెడ్డిని ప్రశ్నించారు ఈడీ అధికారులు.. కాకినాడ సీ పోర్టు, సెజ్ కు సంబంధించి అక్రమంగా షేర్లను బదలాయించుకున్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సాయిరెడ్డిని ప్రశ్నించారు అధికారులు.. ఇక, విచారణ అనంతరం ఈడీ కార్యాలయం దగ్గర మీడియాతో మాట్లాడారు విజయసాయిరెడ్డి.. కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ నన్ను విచారించింది.. 25 ప్రశ్నలు అడిగారు.. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసింది.. కేవీ రావు నాకు తెలియదు అని చెప్పాను.. అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు… కాకినాడ సీ పోర్ట్ విషయంలో కేవీ రావుకు ఎక్కడ నేను ఫోన్ చేయలేదని స్పష్టం చేశారు.

Read Also: Film Watching Countries : ఆ దేశస్తులు అలాంటి మూవీస్ ఎక్కువగా చూస్తారట ? గణాంకాలు చూస్తే తలపట్టుకోవాల్సిందే ?

ఇక, కేవీ రావును తిరుమలకు రమ్మని చెప్పమని చెప్పండి అని చెప్పాను.. నేను తప్పు చేస్తే ఏ శిక్ష కైనా నేను సిద్ధం అన్నారు విజయసాయిరెడ్డి.. మే నెల 2020లో నేను ఫోన్ చేశానని కేవీ రావు చెబుతున్నాడు.. కాల్ డేటా తీసి చూడండి.. నేను ఎక్కడ కూడా కేవీకి ఫోన్ చేయలేదు అన్నారు.. అంతేకాదు.. కేవీ రావును ఈడీ విచారణకు పిలవండి అని కోరినట్టు వెల్లడించారు.. రంగనాథ్‌ కంపెనీని ప్రభుత్వానికి ఎవరు పరిచయం చేశారని ఈడీ ప్రశ్నించింది.. నాకు సంబంధం లేదు అని చెప్పాను.. నేను ఒక సాధారణ మైన ఎంపీని మాత్రమే.. శ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీ ఎవరు ఆపాయింట్ చేశారో నాకు తెలియదు అని చెప్పాను. శరత్ చంద్ర రెడ్డితో ఉన్న సంబంధాలు కూడా అడిగారు.. కుటుంబ రీలేషన్ అని చెప్పాను అని పేర్కొన్నారు..

Read Also: Roja: అల్లు అర్జున్ పేరు లాగుతూ పవన్ కళ్యాణ్ పై రోజా విమర్శలు

మరోవైపు కాకినాడ సీ పోర్ట్ విషయంలో నాకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారని వెల్లడించారు విజయసాయిరెడ్డి.. లుక్ ఔట్ నోటీసులపై నేను ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాను.. కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు కేసు అయితే నేను సివిల్ అండ్ క్రిమినల్ సూట్ వేస్తానని ఈడీకి చెప్పానన్నారు.. విక్రాంత్ రెడ్డి తెలుసా అని అడిగారు.. విక్రాంత్ రెడ్డి తో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరుపలేదు.. 22 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీలు గురించి అడిగారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు పిలుస్తోందని నేను అనుకోవడం లేదన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి..

Exit mobile version