NTV Telugu Site icon

MP Chamala Kiran: రియల్ హీరో అనుకున్నాం కానీ.. రీల్ హీరో లాగానే వ్యవహరించారు..

Mp Chamala Kiaran Reddy

Mp Chamala Kiaran Reddy

MP Chamala Kiran: అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై స్పందించిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌కి తన సినిమాల కలెక్షన్లు తప్ప ప్రజల గురించి పట్టింపు లేదని అన్నారు. మూడేళ్లుగా మీరు కష్టపడి తీసిన సినిమా నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టికెట్ ధరలు పెంచేందుకు అంగీకరించిందన్నారు. ఆ రోజు సంధ్య థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు బయట అంబులెన్స్ వచ్చింది, అంతా గందరగోళంగా ఉంది. ఏం జరుగుతుందోనని, సినిమా కలెక్షన్ల గురించి ఆందోళన లేదని, బయట ఏం జరుగుతోందో అనే ధ్యాస మీకు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Bomb Threat: ఎగ్జామ్స్ వాయిదా వేసేందుకు స్కూల్కి స్టూడెంట్స్ బాంబు బెదిరింపులు..

సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో ప్రజల సంక్షేమం కోసమే మాట్లాడారని, దానిపై మీరు రియల్ హీరో లాగా వ్యవహరిస్తారని అనుకున్నాం అన్నారు. కానీ.. అల్లు అర్జున్‌ రీల్ హీరో లాగానే వ్యవహరించారని మండపడ్డారు. సంధ్య థియేటర్ ఎదురుగా అంబులెన్స్ ఎందుకు వచ్చింది? ఏం జరిగిందనేది కూడా మరుసటి రోజు తెలిసిందని అల్లు అర్జున్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. నిన్న మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారో కూడా అర్థం కాలేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుండా ఉండేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చామల కిరణ్‌ రెడ్డి తెలిపారు.
Skin Beauty Tips: నల్ల జీలకర్రతో చర్మ సౌందర్యం.. తరచూ వాడితే!

Show comments