NTV Telugu Site icon

Arvind Dharmapuri: ఆర్ఓబి పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి.. సీఎంని కోరిన ఎంపీ అర్వింద్

Mp Arvind Kumar

Mp Arvind Kumar

Arvind Dharmapuri: ఇటీవల కేంద్ర కేబినెట్ జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో నవోదయల ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ తో కలిసి ఈ రెండు జిల్లాల్లో నవోదయల ఏర్పాటుకు ఒక్కోచోట సుమారు 20 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా రెండు జిల్లాల్లో పలు ప్రతిపాదిత స్థలాలను సీఎంకు ఎంపీ వివరించారు.

Read also: Bandi Snajay: ఆ పార్టీని నమ్ముకుంటే.. బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుంది..

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను ఎంపీ అర్వింద్ వివరిస్తూ, మాధవ్ నగర్ ఆర్ఓబి 50-50 పద్ధతిలో మంజూరు చేయబడిందని, అడివి మామిడిపల్లి ఆర్ఓబి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైనప్పటికీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను మళ్ళించిందన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులు అందక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దీనివల్ల పనుల్లో కొంత జాప్యం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఇతర ఆర్వోబీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని సీఎంకు వివరించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేసి, పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలని సీఎంను కోరారు.

Read also: Bandi Sanjay: 50 ఏళ్లుగా హీరోలు వస్తున్నారు.. సెక్యురిటీ కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యం..

జిల్లాలో ప్రతిపాదిత జక్రాన్ పల్లి ఎయిర్పోర్ట్ పనులకు సంబంధించి ఓఎల్ఎస్ సర్వేని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసి కేంద్రానికి నివేదించాలని కోరారు. మరోవైపు జగిత్యాల పట్టణంలో కేంద్రీయ విద్యాలయం సైతం మంజూరయ్యే దశలో ఉందని, దీనికి కూడా స్థల అన్వేషణ చేయాలని సీఎంని కోరారు. జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ ఎంపీ అర్వింద్ తో కలిసి జగిత్యాల పట్టణానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. తామ విజ్ఞప్తుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎంపీ అరవింద్ తెలియజేశారు.
Telangana DGP: ప్రజల భద్రత కంటే.. సినిమా ప్రమోషన్‌ ముఖ్యం కాదు!